మెహ్రీన్.. ఈ పంజాబీ భామ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `కృష్ణ గాడి వీర ప్రేమ గాథ` చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన మెహ్రీన్.. తొలి సినిమాతోనే యూత్ ను అట్రాక్ట్ చేసింది. ఆ తర్వాత మహానుభావుడు, రాజా ది గ్రేట్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుని టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.
మరోవైపు తమిళంలో కూడా నటిస్తూ సత్తా చాటింది. ఇక కెరీర్ పీక్స్ లోకి వెళ్తుంది అనుకుంటున్న సమయంలో మెహ్రీన్ గ్రాఫ్ అనూహ్యంగా పడిపోయింది. ఎఫ్ 3 వంటి సూపర్ హిట్ పడినా సరే మెహ్రీన్ ను ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం `స్పార్క్` అనే ఓ సినిమాలో నటిస్తోంది. అది కూడా ఓ డబ్యూ హీరో మూవీ. ఇది మినహా మెహ్రీన్ చేతిలో మరో ప్రాజెక్టు లేదు. సినిమాలు విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో మెహ్రీన్ యమా యాక్టివ్ గా ఉంటుంది.
తరచూ గ్లామరస్ ఫోటోషూట్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. తాజాగా వైట్ శారీలో దర్శనమిచ్చింది. అయితే మెహ్రీన్ తాజా లుక్ పై నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. ఛీ.. ఛీ.. ఇలా తయారయ్యావేంటి..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కెరీర్ ఆరంభంలో మెహ్రీన్ ఎంతో ముద్దుగా కనిపించేది. కానీ ఇటీవల ఆమె బాగా బక్క చెక్కి పోయింది. బరువు తగ్గడం వల్ల ఆమె ముఖంలో మునుపటి కల ఏమాత్రం కనిపించడం లేదు. ఇక ఈ నేపథ్యంలోనే ఆమె తాజా లుక్ పై నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు. అభిమానులు సైతం మెహ్రీన్ లుక్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు.