రెండోసారి గ‌ర్భం దాల్చిన అలియా భ‌ట్‌.. య‌మా ఫాస్ట్ గా ఉన్నారే..?!

బాలీవుడ్ స్టార్ కిడ్ అలియా భ‌ట్ గ‌త ఏడాది ఏప్రిల్ లో స్టార్ హీరో ర‌ణ‌బీర్ క‌పూర్ ను వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఐదేళ్లపాటు డేటింగ్ చేసిన ఈ జంట‌.. ఏప్రిల్ 14న ముంబైలో అంగ‌రంగ వైభ‌వంగా వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి అయిన ఏడు నెల‌ల‌కే పండంటి ఆడబిడ్డకి అలియా భ‌ట్ జన్మనిచ్చింది.

దీంతో గ‌ర్భం దాల్చిన త‌ర్వాత అలియా భ‌ట్‌, ర‌ణ‌బీర్ క‌పూర్ వివాహం చేసుకున్నార‌ని స్ప‌ష్టంగా తేలిపోయింది. ఇక‌పోతే అలియా భ‌ట్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైర‌ల్ గా మారింది. అదేంటంటే.. అలియా భ‌ట్ రెండోసారి గ‌ర్భం దాల్చింద‌ని బీటౌన్ లో టాక్ నడుస్తోంది. అలియా భట్ తన రెండో బిడ్డ‌ను ఆహ్వానించేందుకు రెడీ అయ్యిందని బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి.

 

ఇటీవల ఆమె ఓ దుస్తుల కంపెనీ కోసం ప్రచారం చేసినట్లు తెలుస్తోంది. అందులో కొత్త మెటర్నిటీ కలెక్షన్స్ ను లాంచ్ చేసిందట. దీంతో అలియా భట్ మళ్లీ గర్భం ధరించిందంటూ ప్రచారం ఊపందుకుంది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, నెటిజ‌న్లు మాత్రం ర‌ణ‌బీర్, అలియా య‌మా ఫాస్ట్ గా ఉన్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.