బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ తెలుగు సినిమా స్థాయిని మరో లెవల్ కు తీసుకువెళ్లాడు. రీసెంట్ గానే ప్రభాస్ బాలయ్య వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షోలో పాల్గొని బాలయ్యతో చేసిన రచ్చ మామూలుగా లేదు. ఇక దీనితో ఆ ఎపిసోడ్ మొరబుల్ గా నిలిచిపోయింది.
ఇక ఇప్పుడు టాలీవుడ్ సినీ వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం బాలయ్య- ప్రభాస్ లు ఒకే తెరపై కనిపించడం పక్కన పెడితే.. అతి త్వరలోనే బాలయ్య దర్శకుడు తో ప్రభాస్ సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. తాజా అప్డేట్ ప్రకారం బాలయ్యతో దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన వీర సింహారెడ్డి సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా విజయోత్సవాల్లో భాగంగా దర్శకుడు పలు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్నీ బయట పెట్టాడు.
ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గోపీచంద్- ప్రభాస్ కి ఒక కథ చెప్పానని.. వీరితో పాటు టాలీవుడ్ లో ఉన్న మరి కొంతమంది స్టార్ హీరోలతో కూడా సినిమాల కోసం చర్చలు జరుగుతున్నాయని ఆయన రివిల్ చేశారు. ఇక మరో సమాచారం ఏమిటంటే ఆల్రెడీ ప్రభాస్ కి గోపీచంద్ లైన్ అయితే నచ్చిందని ఆల్మోస్ట్ వీరి కాంబినేషన్ కూడా సెట్ అయిందని అంటున్నారు. మరి రాబోయే రోజుల్లో ఎప్పుడు వీరి ప్రాజెక్ట్ ప్రారంభమవుతుందో చూడాలి.