Love today : పెళ్ళికి ముందే ఫోన్లు మార్చుకున్న లవర్స్…ఎం జరిగిందంటే…?

ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలుగా వచ్చి సెన్సేషనల్ క్రియేట్ చేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అలా సౌత్ సినిమా పరిశ్రమంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన చిన్న సినిమా అంటే ‘లవ్ టుడే’ అనే చెప్పాలి. దర్శకుడుగా ఒక సినిమా తీసిన అనుభవంతో ప్రదీప్ రంగనాథన్ అనే యువకుడు.. తానే హీరోగా నటిస్తూ తెరకెక్కించిన సినిమా కోలీవుడ్ లో సెన్సియేషన్ క్రియేట్ చేసింది. భారీ బడ్జెట్ సినిమాలు రేంజ్ లో అధిక వసూళ్లను కొల్లగొట్టింది.

Love Today Telugu Movie Review with Rating | cinejosh.com

ఇదే సినిమాని తెలుగులో అగ్ర నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేస్తే ఇక్కడ కూడా మంచి కలెక్షన్లను అందుకుంది. ప్రేమించుకుని పెళ్లికి సిద్ధమైన ఓ యువ జంట.. ఆ అమ్మాయి తండ్రి కండిషన్ మేరకు ఒక్కరోజు ఇద్దరు ఫోన్లు మార్చుకోవటం వలన ఎదురయ్యే పరిణామాలు నేపథ్యంలో సరదాగా ఉత్కంఠభరితంగా సాగే సినిమా ఇది. ఈ ఐడియా కి ఇప్పటి తరం యువత బాగా కనెక్ట్ అయ్యారు వారి జీవితంలో ఇలా జరుగుతే ఎలా ఉంటుందో అనే ఊహ చాలామందికి వచ్చి ఉండటంలో సందేహం లేదు.

Love Today review. Love Today Tamil movie review, story, rating - IndiaGlitz.com

ఇక ఈ క్రమంలోనే తమిళనాడులో ఒక యువ జంట లవ్ టుడే సినిమాను ఆదర్శంగా తీసుకుని ఇరువురు వారి ఫోన్లను మార్చుకోవటంతో ఎవరు ఊహించని పరిణామాలు తలెత్తి.. చివరికి వారి పెళ్లి ఆగిపోయే పరిస్థితికి వచ్చారు. ఇక దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయానికొస్తే తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన అరవింద్ కు రీసెంట్‌గా ఓ అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరిగింది.

Love Today: A blatant exercise in voyeurism | Entertainment News,The Indian Express

పెళ్లికి ముందు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో లవ్ టుడే సినిమా ఇచ్చిన స్ఫూర్తితో ఇద్దరు వారి ఫోన్లు మార్చుకున్నారు. అయితే ఇక్కడే పెద్ద సమస్య వచ్చింది. పెళ్ళికొడుకు అరవింద్ మొబైల్ ను చెక్ చేస్తుండగా..అందులో న్యూడ్ గా ఉన్నా ఓ అమ్మాయి వీడియో కనిపించడంతో పెళ్లికూతురు కాస్తా షాక్ అయింది. ఈ విషయాన్ని ఎంతో సీరియస్ గా తీసుకున్న ఆ పెళ్లికూతురు అతనితో పెళ్లి క్యాన్సిల్ చేసుకుని.. ఆ వీడియోలో ఉన్న అమ్మాయికి కూడా ఈ విషయం చెప్పిందట.. అంతలోనే ఈ ఇష్యూ పెద్దదిగా మారడంతో పోలీసులు పెళ్ళికొడుకుని అరెస్ట్ చేసే వరకు పరిస్థితి వెళ్ళింది.