బీఆర్ఎస్ ఎదిగితే.. ఏపీలో ఎవ‌రికి న‌ష్టం.. ?

ఏపీలో వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌లు ప్ర‌తిష్టాత్మకంగా మారాయి. టీడీపీ-జ‌న‌సేన పొత్తుతో అధికారం లోకి వ‌చ్చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాయ‌నే చ‌ర్చ సాగుతోంది. ఇక‌, వైనాట్ 175 నినాదంతో మ‌రోసారి విజ యం ద‌క్కించుకునేందుకు వైసీపీ ప్ర‌య‌త్నాలు సాగిస్తోంది. ఈ మొత్తం వ్య‌వ‌హారం గ‌మ‌నిస్తే.. ఏపీలో రెండు ప‌క్షాల మ‌ధ్య ఎన్నిక‌ల రాజ‌కీయం ఊపందుకుంది. వైసీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకు చీల్చ‌న‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ చెబుతున్నాడు.

ఈ క్ర‌మంలో టీడీపీ-జ‌నసేన క‌లిస్తే.. ఖ‌చ్చితంగా అధికారంలోకి వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని అం టున్నారు. అయితే.. ఇప్పుడు బీఆర్ ఎస్‌(భార‌త రాష్ట్ర‌స‌మితి) ఏర్పాటుతో పాటు.. ఏపీలోనూ చ‌క్రం తిప్పా ల‌ని ఈ పార్టీ నిర్ణ‌యించుకుంది. దీంతోఈ ప్ర‌భావం.. ఏపీపై ప‌డుతుంద‌ని.. ఇది ప్ర‌త్య‌క్షంగా కాక‌పోయినా.. ప‌రోక్షంగా వైసీపీకి మేలు చేస్తుంద‌ని ఓ వ‌ర్గం రాజ‌కీయ నేత‌లు అంచ‌నా వేస్తున్నారు.

అంటే.. కొత్త పార్టీకి ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ ఉంటుంద‌నేది వీరి భావ‌న‌. అధికారంలోకి తెచ్చేసేంత కాక‌పోయినా.. అంతో ఇంతో ఖ‌చ్చితంగా ప్ర‌భావం చూపుతుంద‌ని భావిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీకి ప‌ట్టున్న‌తెలంగాణ, ఏపీ స‌రిహ‌ద్దు జిల్లాల్లో బీఆర్ ఎస్ ప్ర‌భావం చూపుతుంద‌ని అనుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఏపీలో బీఆర్ ఎస్‌తో వ‌చ్చే ప్ర‌యోజ‌నం లేద‌ని.. ఒక వ‌ర్గం మీడియా ప్ర‌చారం ప్రారంభించింది. అందుకే బీఆర్ ఎస్ స‌భ‌కు ఏపీ నుంచి బ‌స్సులు పెట్టార‌ని.. పేర్కొంటూ.. ఒకింత అస‌హ‌నం ప్ర‌ద‌ర్శించింది.

BRS-YSRCP: బీఆర్‌ఎస్‌పై వైసీపీ నేతల ఘాటు వ్యాఖ్యలు.. టార్గెట్ మొదలైనట్లేనా?  - Kaburulu

ఇక‌, ఇదే సమ‌యంలో అధికార పార్టీ వైసీపీ జ‌రుగుతున్న ప‌రిణామాలను చాలా నిశితంగా గ‌మ‌నిస్తోంది. ఏపీలో బీఆర్ ఎస్ ఎంట్రీతో త‌మ‌కు లాభిస్తుంద‌నే భావ‌న వీరిలో ఉంది. ఎందుకంటే.. వ్య‌తిరేక ఓటు బీఆర్ ఎస్‌కు అంతో ఇంతో ప‌డినా.. త‌మ‌పై ప్ర‌భావం త‌గ్గి అది ప్ర‌తిప‌క్షాల‌కు దెబ్బ కొడుతుంద‌నే అంచ‌నాతో ఉంది. ఈ క్ర‌మంలో బీఆర్ ఎస్ ఏపీలోకి ఎంట్రీ ఇవ్వ‌డాన్ని టీడీపీ అనుకూల మీడియా ఒక విధంగా చూస్తే.. వైసీపీ అనుకూల మీడియా మ‌రో విధంగా భావిస్తుండ‌డం గ‌మ‌నార్హం.