స్కూల్ లో పిల్ల‌ల‌కు పాఠాలు చెబుతున్న నిత్య మీన‌న్‌.. వీడియో వైర‌ల్‌!

మలయాళ ముద్దుగుమ్మ నిత్యామీనన్ తాజాగా టీచర్ గా అవతారం ఎత్తింది. గవర్నమెంట్ పాఠశాలలో పిల్లలకు తెలుగు పాటలు చెబుతూ కనిపించింది. మలయాళ నటి అయినప్పటికీ తెలుగింటి ఆడపడుచుల కనిపించే నిత్యమీనన్ కు టాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ ఉంది. కెరీర్‌ ఆరంభం నుంచి గ్లామర్ షోకు దూరంగా ఉంటూ ప్రాధాన్యత ఉన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చింది.

ప్రస్తుతం ఈ అమ్మడు మలయాళం లో పలు చిత్రాలు చేస్తోంది. అయితే ఓ మూవీ షూటింగ్ లో భాగంగా నిత్య మీన‌న్‌ ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాపురం వెళ్ళింది. అయితే షూటింగ్ గ్యాప్ లో అక్కడే ఉన్నా గవర్నమెంట్ స్కూల్ ను నిత్యా సందర్శించింది. అంతేకాదు అక్కడ ఉన్న పిల్లలకు తెలుగు పాఠాలు చెప్పింది.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్క‌ర్లు కొడుతుంది. ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు నిత్యామీనన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. స్వతహాగా మలయాళీ అయినప్పటికీ ఎంతో చక్కగా పిల్లలకు తెలుగు పాఠాలు చెబుతుందంటూ ముచ్చట పడుతున్నారు.

https://www.instagram.com/reel/CnjY48EKC1v/?utm_source=ig_web_copy_link