చిరు తండ్రి నటించిన సినిమాలు ఏమిటో తెలుసా..!

పునాదిరాళ్ళు సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమైన మెగాస్టార్ చిరంజీవి.. తర్వ‌త‌ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా నటించి తన స్వయంకృషితో తెలుగులో స్టార్ హీరోగా ఎదిగాడు. తన సినిమాలతో తెలుగు తెరకు కమర్షియల్ స్ట్రెంత్ పెంచిన హీరోగా.. తన నటనతో సెంటిమెంట్, డాన్స్ ఏదైనా అవలీలగా నటించగల పండితుడు చిరంజీవి. తన నటుడుతో టాలీవుడ్ లో మెగాస్టార్ గా పేరు తెచ్చుకుని ఇప్పటికీ సినిమాలు చేస్తూ అభిమానులను మెప్పిస్తూనే ఉన్నాడు.

చిరంజీవి అసలు పేరు కొణిదెల శివ శంకరవరప్రసాద్. తన కెరీర్ మొదలు పెట్టి తెలుగు తెరకు ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ ఎన్నో రికార్డులను బ్రేక్ చేశాడు.. మరెన్నో రికార్డుల‌ను సృష్టించాడు.
మెగాస్టార్ సినిమాల్లోకి వచ్చిన తర్వాత తన కుటుంబం నుంచి కూడా ఎందరో సినీ పరిశ్రమకు వచ్చారు. ముందుగా ఆయన తమ్ముళ్లు నాగబాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆ తర్వాత ఆయన కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇలా ఎందరో ఆ కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరో లాగా ఎదిగారు.

అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే చిరంజీవి తండ్రి కొణిదెల వెంకట్రావు కూడా నటనపై ఉన్న మక్కువతో సినిమాల్లో నటించారు. అయితే మెగాస్టార్ తండ్రి సినిమాల్లో నటించారని విషయం ఎక్కువ మందికి తెలియదు. ఇంతకీ అయిన ఏ సినిమాలో నటించాడంటే బాబు గారి దర్శకత్వంలో చిరు హీరోగా వచ్చిన ‘మంత్రిగారి వియ్యంకుడు’ అనే సినిమాలో ఆయన నటించాడు. అంతేకాకుండా చిరంజీవి సినిమాల్లోకి రాకముందే 1969 లో వచ్చిన జగత్ కిలాడీలు అనే సినిమాలో కూడా ఆయన నటించారు. ఈ సినిమా తర్వాత ఆయనకు వరుస అవకాశాలు వచ్చినా,నటుడుగా కొనసాగలేకపోయాడు.

ఇక ఎందుకంటే ఆయన వృత్తి రీత్యా కానిస్టేబుల్ కావటం, కుటుంబ బాధ్యతలు కోసం తనకు ఎంతో ఇష్టమైన నటనకు స్వస్తి చెప్పి కుటుంబ బాధ్యత కోసం తనకు ఇష్టమైన సినిమా రంగాన్ని వదిలిపెట్టి ఉద్యోగం, కుటుంబ బాధ్యతలను నెరవేర్చాడు. ఇక తర్వాత‌ తండ్రిలాగానే నటనపై ఉన్న మక్కువతో కుమారుడు చిరంజీవి సినిమా పరిశ్రమంలో అడుగుపెట్టి, అంచలంచలుగా ఎదిగి టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా తన తండ్రిని మించి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు.