శ్రీ లీల జోరు ముందు .. వాళ్లు తట్టుకునే లా లేరే..!

తెలుగులో పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ముద్దుగుమ్మ శ్రీ లీల. మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది. ఈ సినిమా పెద్దగా హిట్ అవ్వకపోయినా తన అభినయంతో తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది కన్నడ ముద్దుగుమ్మ. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ తో ఈమె తెలుగులో వ‌రుస‌ సినిమా అవకాశాలను దక్కించుకుంది.

14 Sreeleela Hot & Sexy Pics | Dhamaka Heroine - Just for Movie Freaks

మాస్ మహారాజా రవితేజకు జంటగా నటించిన ధమాకా సినిమా గత సంవత్సరం చివరిలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. వరుసగా వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ అవడంతో శ్రీ లీలకు తెలుగులో మరింత క్రేజ్ పెరిగింది. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబుకు జంట‌గా ఛాన్స్ కొట్టేసింది. మహేష్- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఎంపికయింది. అయితే ఈ సినిమాలో శ్రీ లీల ఉందా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

hbdsreeleela - Twitter Search / Twitter

ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా ప్రొడ్యూసర్ నాగ వంశీ ఇచ్చిన క్లారిటీతో శ్రీ లీల ఈ సినిమాలో ఉన్నట్టు కన్ఫర్మ్ అయింది. ఇక ఈ సినిమా ప్రొడ్యూసర్ నాగ వంశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మహేష్ సినిమాకు సంబంధించి హీరోయిన్లకు సంబరింగ్ అంటూ ఏమీ ఇవ్వలేదని.. శ్రీ లీలను సెకండ్ హీరోయిన్ అనడం కరెక్ట్ కాదని చెప్పుకొచ్చాడు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న మహేష్ సినిమాలో శ్రీ లీల కూడా ఓ హీరోయిన్ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.

After Dhamaka success, Sreeleela bags Mahesh Babu's SSMB 28 with Trivikram  Srinivas | Exclusive - India Today

త‌న మూడో సినిమాతోనే మహేష్ బాబు తో ఛాన్స్ కొట్టేయడంతో తెలుగు ప్రేక్షకుల్లో ఆమెకు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో తెలుస్తుంది.. పైగా ప్రొడ్యూసర్ నాగ వంశీ అన్న మాటలు బట్టి చూస్తే ఈ సినిమాలో శ్రీ లీల ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ 30 వ సినిమాలో కూడా శ్రీలీలకు అవకాశం వచ్చినట్టు టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. మహేష్- త్రివిక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి.. ఎన్టీఆర్ సినిమాలో కూడా ఈ అమ్మడు నిజంగా అవకాశం దక్కించుకుంటే.. శ్రీ లీలా క్రేజ్ మరో లెవల్ కు వెళ్తుంది. దీంతో ఈమె జోరుకు ఎవరైనా పక్కకు పోవాల్సిందే. అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు.