శ్రీలీల వల్ల సతమతమవుతున్న హీరోయిన్స్..!!

మొదట పెళ్లి సంద D సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హీరోయిన్ శ్రీ లీల.ఈ సినిమాలో తన అందంతో డ్యాన్స్ తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది ఈ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ కన్నడలో రెండు సినిమాలలో కూడా నటించింది. ఇక రీసెంట్గా రవితేజ తో కలిసి ధమాకా చిత్రంలో నటించగ ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దీంతో శ్రి లీల క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఈ క్రమంలోనే మహేష్ బాబు తో నటించే అవకాశాన్ని అందుకోవడంతో మరింత పాపులారిటీ అందుకుంది.

Sreeleela To Play Female Lead in BoyapatiRAPO; All You Need to Know
అయితే తాజాగా ప్రొడ్యూసర్ నాగ వంశీ క్లారిటీ ఇవ్వడం జరిగింది. మహేష్ సినిమాలో శ్రీ లీల సెకండ్ హీరోయిన్ అనడం కరెక్ట్ కాదని ఆయన నిర్మిస్తున్న సినిమాలో ఆమె కూడా ఒక హీరోయిన్ అంటూ చెప్పుకొచ్చారు నాగ వంశీ. ఇక దీంతో తెలుగు ప్రేక్షకులు ఆమెకు ఏ మేరకు క్రేజ్ ఇచ్చారు అన్న సంగతి తెలుస్తోంది.ఇక అలాగే ఎన్టీఆర్ 30వ సినిమాలో కూడా శ్రీ లీల నటించే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ 30లో ఈ ముద్దుగుమ్మ నిజంగానే ఛాన్స్ దక్కిందంటే ఈమె రేంజ్ మరింత పెరిగిపోయే అవకాశం ఉంది.

దీంతో స్టార్ హీరోయిన్గా వెలుగుతున్న రష్మిక, పూజా హెగ్డే శ్రీ లీలా దెబ్బతో కాస్త జాగ్రత్త పడాల్సిందే అంటూ పలువురు అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. మరి శ్రీ లీల వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తన అందంతో, డాన్స్ తో తన నటనతో మైమరిపించేలా చేస్తోంది. ఇలాగైతే తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ని అందుకోవడం ఖాయం అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.