వ‌ర్కింగ్ డేలోనూ వీక్ అవ్వ‌ని `వీర‌య్య‌`.. బ్రేక్ ఈవెన్ దిశ‌గా అడుగులు!

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోలుగా బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న లేటెస్ట్ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌ `వాల్తేరు వీర‌య్య‌`. ఇందులో శృతి హాస‌న్‌, కేథ‌రిన్ హీరోయిన్లుగా న‌టించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించిన ఈ చిత్రం జనవరి 13న విడుద‌లై పాజిటివ్ టాక్ ను అందుకుంది.

దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఎక్సలెంట్ వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది. వీకెండ్ పూర్తి అయ్యే స‌మ‌యానికి వంద కోట్ల క్ల‌బ్ లో చేరిన ఈ చిత్రం.. వర్కింగ్ డేలోనూ వీక్ అవ్వ‌లేదు. విడుద‌లైన 4వ రోజు అంటే సోమ‌వారం తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 11.42 కోట్ల రేంజ్ లో వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 14.77 కోట్లు సొంతం చేసుకుని బ్రేక్ ఈవెన్ దిశ‌గా అడుగులు వేస్తోంది.

ఈ సినిమా రూ. 89 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బ‌రిలోకి దిగింది. నాలుగు రోజుల్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.73.68 కోట్ల షేర్ ను ద‌క్కించుకుంది. ఇంకా రూ.15.32 కోట్ల షేర్ వ‌చ్చిందంటే.. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక‌ ఏరియాల వారీగా వాల్తేరు వీర‌య్య 4 రోజులు టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ను ఓసారి గ‌మ‌నిస్తే..

నైజాం: 20.31 కోట్లు
సీడెడ్: 11.36 కోట్లు
ఉత్త‌రాంధ్ర: 7.15 కోట్లు
తూర్పు: 5.56 కోట్లు
పశ్చిమ: 3.35 కోట్లు
గుంటూరు: 4.81 కోట్లు
కృష్ణ: 4.1 కోట్లు
నెల్లూరు: 2.22 కోట్లు
—————————————–
ఏపీ+తెలంగాణ‌= 58.88 కోట్లు(95.60 కోట్లు~ గ్రాస్‌)
—————————————–

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా: 5.30 కోట్లు
ఓవ‌ర్సీస్‌: 9.50 కోట్లు
—————————————-
వ‌ర‌ల్డ్ వైడ్‌= 73.68 కోట్లు(127.75 కోట్లు~ గ్రాస్‌)
—————————————-