ఆమే లేకపోతే రాజమౌళి సినిమాల్లోకి వచ్చే వాడే కాదు.. ఇంతకీ ఎవరు ఆమె..?

దర్శకదిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి తెలుగు సినిమా పరిశ్రమ గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా వెలుగొత్తి చాటాడు. బాహుబలితో అతడు టాలీవుడ్ ఇండస్ట్రీని హాలీవుడ్ కి పోటీగా నిలబెట్టాడు. ఆర్ఆర్ఆర్‌తో ఏ భారత సినిమా సాధించలేని రికార్డ్స్‌ను ఇండియాకి తెచ్చి పెట్టాడు. కెరీర్‌లో ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా సినిమా ఇండస్ట్రీలో దిగ్విజయంగా కొనసాగిస్తున్న రాజమౌళి అసలు సినిమాల్లోకి ఎలా వచ్చాడో తెలిస్తే ఎవరైనా సరే ఆశ్చర్య పోవాల్సిందే. తాజాగా స్వయంగా ఈ డైరెక్టరే తన సినీ ఎంట్రీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ స్టార్ డైరెక్టర్ చాలా ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చి ఆకట్టుకున్నాడు.

కొద్ది గంటల క్రితం ఆర్ఆర్ఆర్ మూవీకి బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ పిక్చర్ కేటగిరీలో క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్ లభించింది. ఈ అవార్డ్‌ను జక్కన్న స్వీకరించాడు. ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకున్న సందర్భంగా రాజమౌళి ఇంటర్వ్యూలో మాట్లాడారు. “మా అమ్మ పేరు రాజ నందిని. ఆమె నాలోని టాలెంట్‌ను గుర్తించి నన్ను సినిమా రంగంలోకి అడుగుపెట్టేలా ప్రోత్సహించింది. నేను డైరెక్టర్ అయ్యానంటే దానికి ఆమెనే కారణం. ఇక మా వదిన శ్రీవల్లి కూడా నన్ను ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటుంద”ని రాజమౌళి చెప్పుకొచ్చాడు. రాజమౌళి తల్లి 2012లో 70 ఏళ్ల వయసులో కన్నుమూశారు.

శ్రీవల్లి తనకు మరో అమ్మ అని, తన భార్య రమా రాజమౌళి తనకు మంచి ఎమోషనల్ సపోర్ట్ అని పేర్కొన్నాడు. తన భార్య తన సినిమాలకు మాత్రమే కాదు తన పర్సనల్ ఫ్యాషన్ డిజైనర్ అని కూడా రాజమౌళి చెబుతూ ఆశ్చర్యపరిచాడు. ఆపై మేరా భారత్ మహాన్ జై హింద్ అంటూ రాజమౌళి దేశం పై తనకున్న భక్తిని చాటుకున్నాడు.