`వీర సింహారెడ్డి` 5 డేస్ట్ క‌లెక్ష‌న్స్‌.. ఇంకా ఎంత వ‌స్తే సేఫ్ అవుతుంది?

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచింద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `వీర సింహారెడ్డి`. ఇందులోలో శృతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటిస్తే.. దునియా విజయ్ వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన ఈ చిత్రంలో భారీ అంచనాలు నడుమ జనవరి 12న ప్రేక్షకులు ముందుకు వచ్చింది.

అయితే టాక్ ఎలా ఉన్నా.. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల ప‌రంగా దుమ్ము దుమారం రేపుతోంది. `వాల్తేరు వీర‌య్య‌` ఎఫెక్ట్ కాస్త ప‌డుతున్నా.. బాగానే వ‌సూళ్ల‌ను రాబ‌డుతూ 100 కోట్ల క్ల‌బ్ లో చేరింది. వీకెండ్ పూర్తి అయ్యే స‌మ‌యానికి రూ. 52.65 కోట్లు రేంజ్ లో షేర్ ను అందుకుంది. విడుద‌లైన 5వ రోజు అంటే సోమ‌వారం వ‌ర్కింగ్ డే అయిన‌ప్ప‌టికీ తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.25 కోట్ల రేంజ్ లో షేర్ ను అందుకుని ఎక్సలెంట్ హోల్డ్‌ను చూపించింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 7.25 కోట్ల రేంజ్‌లో వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

ఇక రూ. 74 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం.. ఐదు రోజుల్లో రూ.59.90 కోట్ల రేంజ్ లో వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. అంటే ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద క్లీన్ హిట్ గా నిల‌వాలంటే ఇంకా రూ. 14.10 కోట్ల షేర్‌ను అందుకోవాల్సి ఉంటుంది. ఇక ఏరియాల‌ వారీగా వీర సింహారెడ్డి ఐదు రోజుల‌ టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ను గ‌మ‌నిస్తే..

నైజాం: 13.67 కోట్లు
సీడెడ్: 13.55 కోట్లు
ఉత్త‌రాంధ్ర: 5.16 కోట్లు
తూర్పు: 3.96 కోట్లు
పశ్చిమ: 3.20 కోట్లు
గుంటూరు: 5.30 కోట్లు
కృష్ణ: 3.51 కోట్లు
నెల్లూరు: 2.18 కోట్లు
—————————————–
ఏపీ+తెలంగాణ‌= 50.55 కోట్లు(81.75 కోట్లు~ గ్రాస్‌)
—————————————–

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా: 4.05 కోట్లు
ఓవ‌ర్సీస్‌: 5.30 కోట్లు
—————————————-
వ‌ర‌ల్డ్ వైడ్‌= 59.90 కోట్లు(100.65 కోట్లు~ గ్రాస్‌)
—————————————-