టాలీవుడ్ క్రేజీ హీరోల సక్సెస్ మంత్ర ఇదేనా..?!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోలుగా యంగ్ హీరోలు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలు రెండేళ్లకు, మూడేళ్లకు ఒక సినిమా నటిస్తున్నా.. మిడిల్ రన్ హీరోలు మాత్రం వేగంగా సినిమాలో నటిస్తూ ఆశించిన సక్సెస్‌లు అందుకుంటున్నారు. అతి తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటూ భారీ విషయాలను అందుకుంటూ నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చిపెడుతున్నారు. సరైన కథ, కథనం ఉన్న సినిమాలను ఎంచుకోవడమే హీరోల సక్సెస్ సీక్రెట్ అనడంలో సందేహం లేదు. డీజేటిల్లు, టిల్లు స్క్వేర్‌ సినిమాలతో సిద్దు ఎలాంటి సక్సెస్ అందుకున్నారు ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస విజయాలతో సిద్దు ఇమేజ్ ప్రస్తుతం మరింతగా పెరిగింది.

Tollywood News: రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి.. తూచ్ అంటూ నెలల తరబడి వాయిదా  పడుతున్న సినిమాలు.. - Telugu News | List of Movies which announced release  date but got delayed like Salaar DJ Tillu 2

తన సినిమాలకు తానే కథలు రాసుకుంటూ సిద్దు సక్సెస్ సాధించాడు. మ‌రో హీరో తేజ సజ్జ‌కు ప్రస్తుతం వరుస విజయాలు దక్కుతున్నాయి. జాంబిరెడ్డి, హనుమాన్ సినిమాలతో విజయాలు అందుకున్న ఈయన కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం మీరాయ్ సినిమాతో సూపర్ యోధుడిగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరో టాలెంటెడ్ హీరో అడవి శేష్ క్షణం, గూఢాచారి, ఎవరు, మేజర్ ఇలా వరుస సినిమాలతో సక్సెస్ అందుకుంటున్నాడు. ప్రస్తుతం గూఢాచారి సీక్వెల్, డెకరేట్ సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు శేష్‌. అలాగే టాలీవుడ్ క్రేజీ హీరో నవీన్ పోలిశెట్టికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

HanuMan (Hanu Man) Movie (2024): Release Date, Cast, Ott, Review, Trailer,  Story, Box Office Collection – Filmibeat

తనదైన‌ ప్రత్యేకమైన కామెడీ టైమింగ్ తో వరుస విజయాలను అందుకుంటున్న ఈయన.. జాతి రత్నాలు తరువాత కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోకుండా సక్సెస్ అందుకుంటున్నాడు. మరో యంగ్ టాలెంటెడ్ హీరో సుహాస్ వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు. మీరందరి సక్సెస్ కు విరు ఎంచుకునే కంటెంటే కార‌ణం అని తెలుస్తోంది. వీరు సక్సెస్ రేట్ అంతకంతకు పెరగడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ముందు ముందు మరింత స్టార్‌డం సంపాదించి పాన్‌ ఇండియా లెవెల్ లో సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నారు.