సినిమాలతో బ్లాక్ బస్టర్ అందుకున్న అసంతృప్తితో ఉన్న పాన్ ఇండియన్ స్టార్ దర్శకులు వీళ్లే..?!

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో సినిమా హిట్ అయింది అంటే ఆ సినిమాలో నటించిన నటీనటులతో పాటు.. దర్శకులు, మూవీ టీమ్ అంతా ఎంత సంతోషాన్ని వ్యక్తం చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కొంతమంది స్టార్ట్ డైరెక్టర్లకు మాత్రం సినిమా సక్సెస్ సాధించిన ఆ సినిమాకు సంబంధించిన ఎంతో కొంత అసంతృప్తి మిగిలిపోయిందట. ఇంతకీ ఆ స్టార్ డైరెక్టర్లు ఎవరో..? వారికి ఉన్న సంతృప్తి ఏంటో..? ఒకసారి చూద్దాం. పాన్ ఇండియన్‌ స్టార్ట్ డైరెక్టర్‌గా రాజమౌళి ఎలాంటి గుర్తింపు తెచ్చుకున్నారా అందరికీ తెలుసు. అయితే గతంలో ఆయన పాన్ ఇండియా స్టార్ గా మారకముందు ఎన్టీఆర్ తో యమదొంగ సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

Yamadonga Full Movie Online in HD in Telugu on Hotstar UK

ఈ సినిమా అనుకున్న విధంగా రూపొందించలేకపోయానని.. టెక్నికల్ అంశాల విషయంలో మరింత జాగ్రత్త పడాల్సిందని జక్కన్న ఇప్పటికీ ఫీల్ అవుతారట. అయినా అప్పట్లోనే ఈ సినిమా రూ.32 కోట్ల షేర్ సొంతం చేసుకుంది. ఇక మరో పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తన తొలి సినిమా ఉగ్రం విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటారట. ఈ సినిమాను టెక్నికల్‌గా ఆశించిన ఆరేంజ్‌లో చేయలేకపోయానని ఆయన భావిస్తారట. ఈ లోటును తీర్చుకునేందుకే ప్రశాంత్ నీల్‌ ఉగ్రం కథతో సలార్ సినిమాను రూపొందించారని తెలుస్తోంది. ఇక మరో సెన్సేషనల్ పాన్ ఇండియన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ మొదట అర్జన్ రెడ్డితో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

Ugramm (2014) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

ఈ సినిమా 30 నిమిషాలు న‌డివి తగ్గించార‌ని సందీప్ రెడ్డివంగా ఇప్పటికీ ఫీల్ అవుతారట. అర్జున్ రెడ్డి సినిమాను పూర్తి నడివితో రిలీజ్ చేసి ఉంటే ఆ అసంతృప్తి ఆయనకు ఉండేది కాదని తెలుస్తోంది. ఈ ముగ్గురు డైరెక్టర్లు 100% సక్సెస్ రేట్ ఉన్న దర్శకులు కావడం విశేషం. ఇక ఇప్పటికే వీరు తీస్తున్న నెక్స్ట్ ప్రాజెక్ట్పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలను నెలకొన్నాయి. సూపర్ స్టార్ మహేష్ తో రాజమౌళి సినిమా తెర‌కెక్కిస్తుండగా.. ఎన్‌టీఆర్‌, ప్రశాంత్ నీల్‌ కాంబో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సందీప్ రెడ్డివంగా నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రభాస్ తో ఉండడం విశేషం. ఈ సినిమాలు ఎలాంటి సక్సెస్ లో అందుకుంటాయో వేచి చూడాలి.