సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. పివిఆర్ ఐనాక్స్ ఇంట్రెస్టింగ్ డెసిషన్ వైరల్.. ?!

సినీ ప్రియులకు పివిఆర్ ఐనాక్స్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే తాజాగా సినీప్రియుల కోసం పివిఆర్ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. తమ మల్టీప్లెక్స్ సినిమాలో చూసేందుకు వచ్చే ఆడియన్స్ సంఖ్యను మరింతగా పెంచేందుకు పివిఆర్ తీసుకున్న కీలక నిర్ణయం ప్రస్తుతం నెట్టింటి వైరల్ గా మారింది. సినిమాలు షోలు ప్రారంభం కి ముందు ప్రదర్శించే వాణిజ్య ప్రకటనలు పలు నగరాల్లోని.. లగ్జరీ మల్టీప్లెక్స్ లో ఇప్పటికే ఈ సంస్థ ఆపేసింది. మరికొన్ని చోట్ల అదే విధానాన్ని అమలు చేయనున్నట్లు వివరించింది. దాదాపు 35 నిమిషాలు యాడ్ స్లాట్ ను పది నిమిషాలకు కుదించి అదనపు షోస్ వేసేందుకు ప్లాన్ చేస్తూందట.

అలాగే బ్రేక్ సమయంలో యాడ్ చేసేందుకు ప్రేక్షకులు ఇష్టపడడం లేదు.. కనుక త్వరలోనే రిలీజ్ కాబోయే సినిమాల ట్రైలర్లను ఆసక్తి చెబుతున్నారనే ఉద్దేశంతో ట్రైలర్లు మాత్రమే చూపించే విధంగా పివిఆర్ నిర్ణయం తీసుకున్నట్లు.. పివిఆర్ ఐనాక్స్ సంస్థ ది లగ్జరీ కలెక్షన్ అండ్ ఇన్నోవేషన్ చీఫ్.. రెనాల్ట్ పలియర్ వివరించారు. పలువురు ప్రేక్షకులు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ను ఆధారంగా తీసుకుని యాడ్ ఆపే విధానాన్ని తీసుకోచ్చినట్లు చెప్పుకొచ్చారు. ప్రకటనలు ప్రదర్శించే సమయాన్ని తగ్గించి సినిమా షోల సంఖ్యను పెంచేందుకు ప్లాన్ చేస్తున్నార‌ట.

యాడ్స్ లేకపోవడం వల్ల నష్టం వస్తుంది.. కానీ అదనపుషోలు వల్ల వచ్చే ప్రేక్షకుల టికెట్లతో ఆ నష్టాన్ని భర్తీ చేయొచ్చనే ఉద్దేశంతో సినిమాలు ప్రారంభమయ్యే పది నిమిషాల ముందు కొత్త సినిమాల ట్రైలర్ ప్రదర్శిస్తున్నట్లు వివరించారు. అయితే రెండు మూడు ప్రముఖ బ్రాండ్ల యాడ్లు కూడా అందులో భాగమవుతున్నాయని చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఈ విధానం ఢిల్లీ, ముంబై, బెంగళూరు మరికొన్ని ప్రదేశాలలో అమలులో ఉంది. త్వరలోనే పూణేలో ప్రారంభించినట్టు.. కొన్ని నెలల్లో మరిన్ని ప్రదేశాల్లో అమలు చేస్తున్నట్లు ఆయన వివరించాడు.