మహేశ్ ఫ్యాన్స్ కి ఎగిరి గంత్తేసే న్యూస్.. రాజమౌళితో సినిమా మొదలైయ్యేది ఆ స్పెషల్ రోజు నాడే..!

ఇది నిజంగా ఘట్టమనేని మహేష్ బాబు ఫ్యాన్స్ కి సూపర్ గూస్ బంప్స్ తెప్పించే న్యూస్ అనే చెప్పాలి . ఇన్నాళ్లు మహేష్ బాబు రాజమౌళి కాంబోలో తెరకెక్కే సినిమా షూట్ ఆలస్యం కాబోతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది . అసలు అక్టోబర్ నవంబర్ టైం లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు అంటూ ప్రచారం జరిగింది. అయితే అదంతా అబద్ధమని త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రాబోతుంది అంటూ టాలీవుడ్ సర్కిల్స్లో వార్త బాగా ట్రెండ్ అవుతుంది.

గుంటూరు కారం సినిమా తర్వాత హ్యూజ్ ట్రోలింగ్ ఎదుర్కొన్న మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం చాలా చాలా కష్టపడుతున్నాడు. లుక్స్ మార్చేసాడు ..బరువు తగ్గాడు అంతేకాదు ఈ సినిమా కోసం చాలా చాలా సహసాలు చేస్తున్నాడట . కాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మే 31న మహేష్ బాబు తండ్రి దివంగత స్టార్ హీరో కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ లాంచింగ్ ఈవెంట్ ను చేయబోతున్నారట.

ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. తొందరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా విడుదల చేస్తూ ఒక స్పెషల్ గ్లింప్స్ తో రిలీజ్ చేయబోతున్నారట మేకర్స్ . దీంతో ఈ విషయం తెలుసుకున్న ఘట్టమనేని ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి . ఈగర్లీ వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ఈ సినిమాకు నిర్మాతగా శ్రీ దుర్గా ఆర్ట్స్ డాక్టర్ కే ఎల్ నారాయణ వ్యవహరిస్తూ ఉండగా ఇందులో ఇండోనేషియన్ బ్యూటీ కూడా కనిపించబోతున్నట్లు సమాచారం అందుతుంది..!