“ధనుష్-ఐశ్వర్య లది దొంగ బ్రతుకు..అందుకు వేస్ట్”..నిర్మాత సంచలన కామెంట్స్..!

సోషల్ మీడియాలో స్టార్స్ గురించి మాట్లాడుకోవడం స్టార్ సెలబ్రెటీస్ పై చీప్ కామెంట్స్ చేయడం ఈ మధ్యకాలంలో ఎక్కువ చూస్తున్నాం . ఒక స్టార్ పై మరొక స్టార్ సెలబ్రిటీ ఇలా వ్యంగ్యంగా వెటకారంగా కౌంటర్స్ వేస్తూ ఉండడం గమనార్హం . తాజాగా కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత కి రాజన్ మాట్లాడిన మాటలు సంచలనం సృష్టిస్తున్నాయి . అది కూడా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ అయిన ధనుష్ ఆయన మాజీ భార్య ఐశ్వర్య పై కామెంట్స్ చేయడం ఇప్పుడు కోలీవుడ్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

మనకు తెలిసిందే రజనీకాంత్ కూతురు ఐశ్వర్య కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ను పెళ్లి చేసుకుంది. వీళ్ళకి ఇద్దరు పిల్లలు. హ్యాపీగా సాగిపోతున్న వీళ్ళ సంసారంలో చికాకులు మొదలయ్యాయి . వీళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకోవాలి అని డిసైడ్ అయ్యారు . త్వరలోనే కోర్టు వీళ్ళకు విడాకులు మంజూరు చేయబోతుంది . అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ నిర్మాత రాజన్ మాట్లాడుతూ ధనుష్ ఐశ్వర్యలపై సంచలన కామెంట్స్ చేశారు .

ఆయన మాట్లాడుతూ ..”ధనుష్ ఐశ్వర్యాలతో ఫేక్ లైఫ్ ..తెరపై ఎలా నటించాము అనుకుంటారో.. నిజ జీవితంలో కూడా ఆలగే నటించేస్తున్నారు.. ధనుష్ ఐశ్వర్య ఆలోచించుకోవాలి ఇదేం బొమ్మలాట కాదు కదా ..18ఏళ్లు కలిసి కాపురం చేసి ఇప్పుడు విడాకులా..? పిల్లల గురించి అయినా ఆలోచించాలిగా ..? ఇద్దరు కలిసి జీవించాలని నా విన్నపం అంటూ చెప్పుకొచ్చారు “. ప్రెసెంట్ ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి . ధనుష్ కి వేరే హీరోయిన్ తో ఎఫర్ ఉందని ఆ కారణంగానే ఐశ్వర్య విడాకులు ఇస్తుంది అని కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . అయితే అదే కోలీవుడ్ మీడియాలో ఐశ్వర్యరాకు ఒక స్టార్ హీరోతో అఫైర్ ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది . నిజా నిజాలు మాత్రం ఆ దేవుడికే తెలియాలి అంటున్నారు ఫ్రెండ్స్..!