అఖిల్ తల రాతే మార్చే లక్కి బ్యూటీ ఆమెనా..? జాతకంలో అలా ఉందా..?

ఒక్క ఛాన్స్ ..ఒకే ఒక్క ఛాన్స్.. ఈ ఛాన్స్ కోసం చాలామంది తమ లైఫ్ లో వెయిట్ చేస్తూ ఉంటారు . అది చదువు అయినా ..ఎగ్జామ్ అయినా ..ఉద్యోగం అయినా లైఫ్ లో సెటిల్ అవ్వాలి అన్న ఏ విషయం కారణంగా అయినా సరే మనకి లైఫ్ లో ఒక ఛాన్స్ వస్తుంది.. ఆ ఛాన్స్ ని మిస్ చేసుకోకూడదు మిస్ చేసుకున్నామా..? అంతే సంగతులు ..ఇక దేవుడు మళ్లీ మళ్లీ ఆ ఛాన్స్ మనకు ఇవ్వడు.

అలాంటి ఛాన్సెస్ ఎన్నో మిస్ చేసుకున్నాడు అఖిల్ . అయితే మరోసారి అక్కినేని అఖిల్ కు మరో ఛాన్స్ ఇవ్వబోతున్నాడు దేవుడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్న అఖిల్ సూపర్ డూపర్ హిట్ డైరెక్టర్ తో సినిమా ఛాన్స్ ని పట్టేసాడట . అంతేకాదు ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ జాన్వికపూర్ హీరోయిన్గా నటించబోతుందట . జాన్వి కూడా దీనికి ఓకే చేయడం ఇప్పుడు అందరికీ షాకింగ్ గా ఉంది .

బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటించిన ఆమెకు పెద్ద క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ రాలేదు . కానీ తెలుగులో మాత్రం దేవర సినిమాలో ఆఫర్ పట్టేగానే ఆమె పేరు మారుమ్రోగిపోతూ వచ్చింది . అదేవిధంగా రాంచరణ్ నటించిన సినిమాలోను అవకాశం దక్కించుకుంది . ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న సినిమాలోను ఆఫర్ దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ఇలాంటి మూమెంట్లో ఆమె అఖిల్ సినిమాలో కూడా అవకాశం దక్కించుకుందని తెలియడంతో జనాలు షాక్ అయిపోతున్నారు. అఖిల్ తలరాతను మార్చే హీరోయిన్ ఈమె అంటూ కామెంట్స్ చేస్తున్నారు.