ఆ విషయంలో చిరంజీవి తప్పు చేస్తున్నాడా..? ఆ “అతి” కొంపముంచేస్తుందా..?

చిరంజీవి ..టాలీవుడ్ చరిత్రను తిరగ రాసిన వన్ అండ్ ఓన్లీ స్టార్ హీరో . మెగాస్టార్ గా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . అంతేకాదు చిరంజీవి పేరు చెప్పుకొని పదిమంది ఇండస్ట్రీలోకి వస్తున్నారు అంటే కారణం ఆయనే ఇన్స్పిరేషన్.. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి రావడం పెద్ద విషయమైన టైంలో వచ్చి కష్టంతో ఆయన ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ ఎదుగుతూ తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు.

ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు బాగా వైరల్ గా మారాయి . మెగా ఫ్యామిలీకి నెగిటివ్గా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. అందులో స్టార్ సెలబ్రెటీస్ కూడా ఉండడం గమనార్హం . అయితే మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఎక్కడ నోరు విప్పట్లేదు. అలా కాదు ఇలా కాదు అది తప్పు అని చెప్పడం లేదు. దీంతో మెగా ఫాన్స్ కూడా కొన్నిసార్లు చిరంజీవి మంచితనం పై మండి పడాల్సిన పరిస్థితి వస్తుంది. కొందరైతే ఓపెన్ గా చెప్పేస్తున్నారు . ఇది కలియుగం ఈ యుగంలో అతి మంచితనం అనేది కూడా పనికిరాదు. ఎవరికీ ఎప్పుడు ఎలా ఇచ్చి పడేయాలో అలానే ఇచ్చేయాలి అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు .ఈ విషయాన్ని చిరంజీవి ఎప్పుడు తెలుసుకుంటాడో ..తనపై నెగటివ్గా కామెంట్స్ చేసే వాళ్ళకి ఎప్పుడు ఇచ్చి పడేస్తాడో అంటూ మెగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

7
ప్రజెంట్ మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. ఈ సినిమా కోసం బాగా కష్టపడుతున్నాడు. విశ్వంభర అనే ట్రెడిషనల్ టైటిల్ ని కూడా పెట్టుకోచ్చారు .ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది . ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది.