షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిన వెంకటేష్.. రాజకీయాల్లోకి వచ్చేశాడ్రోయ్.. ఏ పార్టి తరపున ప్రచారం చేయబోతున్నాడంటే..?

రాజకీయాల్లోకి సినీ స్టార్స్ ఎంట్రీ ఇవ్వడం పెద్ద గొప్ప విషయం కాదు . గతంలో చాలామంది స్టార్ సెలబ్రెటీస్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తమదైన స్టైల్ లో రాజ్యమేలేసారు. చక్రం తిప్పేశారు ..ఇప్పుడు కూడా చాలామంది స్టార్స్ ఇండస్ట్రీలో ఉండే యాక్టర్స్ రాజకీయాల్లో ఉన్నారు . రీసెంట్గా వెంకటేష్ కి సంబంధించిన ఒక వార్త నెట్టింట బాగా వైరల్ గా మారింది. ఎప్పుడు కూడా వెంకటేష్ రాజకీయాలకు దూరంగా ఉంటాడు . ఈ విషయం మన అందరికీ తెలిసిందే . కాగా ఈసారి మాత్రం రాజకీయాల్లోకి వెంకటేష్ రావడం పక్కా అని ఆయన ఒక పార్టీ తరపున ప్రచారం చేయబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది .

దానికి కారణం ఆయన వియ్యంకుడు అంటూ ప్రచారం చేస్తున్నారు . హైదరాబాద్ లోక్ సభ స్థానానికి మహమ్మద్ సమీర్ ..కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా రాజేంద్ర రావు తో పాటు ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డి ల పేర్లను అందులో కాంగ్రెస్ ప్రకటించింది . ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఖమ్మం అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి సినీ హీరో వెంకటేష్కు స్వయాన వియ్యంకుడు .

తెలంగాణలో మే 13న లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఖమ్మం పార్లమెంట్ కి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రామసహాయం నామినేషన్ వేశారు. దీంతో కచ్చితంగా వియ్యంకుడు కోసం వెంకటేష్ ఆ పార్టీ తరపున ప్రచారం చేస్తారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు రఘురాం రెడ్డికి సినీ రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖ కుటుంబాలతో కూడా బంధుత్వం ఉంది . వెంకటేష్ కుమార్తె ఆశ్రితను ఆయన పెద్ద కుమారుడు వినాయక్ రెడ్డి పెళ్లి చేసుకోగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమార్తె స్వప్ని రెడ్డి ను ఆయన చిన్న కుమారుడు అర్జున్ రెడ్డి వివాహం చేసుకున్నారు . ఇలా వెంకటేష్ ఆ పార్టీ తరపున ప్రచారం చేయబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో ఇండస్ట్రీలో వార్తలు వైరల్ గా మారాయి..!!