ట్రోలర్స్ కు వరలక్ష్మి శరత్ కుమార్ స్ట్రాంగ్ రిప్లై.. మీ అమ్మనో అక్కనో అంటే చెప్పుతో కొడతారంటూ..?!

టాలీవుడ్ లేడీ రెబల్ స్టార్‌గా క్రేజ్ సంపాదించుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ అమ్మడు.. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ అంద‌రిని ఆక‌ట్టుకుంది. సినిమాలోనే కాదు లైఫ్ లోను అంతే బోల్డ్‌గా.. ఓపెన్ గా ఉండే ఈ అమ్మడు ఏమనిపిస్తే అది ముక్కుసూటిగా మాట్లాడేస్తూ ఎన్నోసార్లు వార్తలో వైరల్ గా మారింది. తాజాగా వరలక్ష్మీ శరత్ కుమార్ ట్రోల్స్, రివ్యూలు ఇచ్చే వారిపై ఫైర్ అయింది. ఈ నేపథ్యంలో వరలక్ష్మి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. వారి సినిమాలపై సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు, ట్రోల్స్ పై ఆమె స్పందిస్తూ.. ఒకప్పుడు ఆడియన్స్ తో డైరెక్ట్ ఇంట్రాక్షన్ ఉండేది.. థియేటర్లలో కలిసినప్పుడు సినిమాపై ఒపీనియన్ మాట్లాడేవాళ్లు.

Varalaxmi Sarathkumar : కాబోయే భర్తని అప్పుడే కంట్రోల్లో పెట్టేసిన  వరలక్ష్మి శరత్ కుమార్.. తన సినిమాల గురించి.. | Varalaxmi sarathkumar  comments about her fiance in sabari movie ...

అయితే డైరెక్ట్ గా మాట్లాడినప్పుడు ఎవరూ నెగటివ్గా చెప్పరు. బాగుందని అంటారు.. అరుస్తారు.. దీంతో పాజిటివ్ వైబ్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చి ప్రతి ఒక్కరు తమకు వచ్చిన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే నెగిటివ్గా పెడితే ఎక్కువ వ్యూస్ వస్తాయని చెప్పి అదొక ఫ్యాషన్ గా మారిపోయి కొంతమంది కావాలనే నెగిటివ్గా స్పందిస్తూ ఉంటారు. బాగాలేదని, వేస్ట్ అని సినిమా రివ్యూ ఇస్తూ ఉంటారు. అలానే రెండోది మీ డ్రెస్ గురించి అడిగితే చాలా అసహ్యంగా ఉందని చెప్తూ ఉంటారు. ఇది ఫ్రాంక్‌నెస్ అంటూ ఉంటారు. అలాగే కొంత మంది.. నాకేమో నీ డ్రెస్ నచ్చలేదు.. నీకు కంఫర్ట్ అనిపిస్తే వేసుకో.. తమ స్టైల్ లో చెప్తారు. అయితే చివ‌రిది హానెస్ట్ కామెంట్.

కానీ చాలామంది నీచంగా కామెంట్స్ చేస్తూ కూడా నేను నిజాయితీగా చెప్తున్నాను అని భావిస్తారు. కానీ అది అస్సలు హానెస్ట్ కామెంట్ కాదు. మీ అమ్మ గురించి మీ అక్క గురించి అలా మాట్లాడితే వారు స్పాట్లో చెప్పుతో కొడతారు. కనుక ఇలాంటి బేస్లెస్ ఐడెంటిటీ లేని కామెంట్లు చేసిన వాళ్ళని మనం పట్టించుకోనవసరం లేదు. ఏ పని లేక ఇంట్లో కూర్చుని ఖాళీగా ఉన్న వారే ఇలాంటి కామెంట్లు చేస్తూ ఉంటారు. వాళ్ళ జీవితంలో సాధించేది ఏది ఉండదు. అలాంటిది వాళ్ళకి ఎందుకు ప్రయారిటీ ఇవ్వాలి అంటూ వరలక్ష్మి ప్రశ్నించింది. అలాంటివారు కామెంట్స్ చేసినా నవ్వుకుంటూ వెళ్లిపోతా అంటూ రిప్లై ఇచ్చింది. ఇక పబ్లిక్ రివ్యూ క్రిటిక్స్ గురించి మాట్లాడుతూ ప్రతి సినిమా బాలేదని టక్కున చెప్పేస్తారు.

Sabari will enthrall audience for its seat edged thrilling sequences: Varalaxmi  Sarathkumar - Latest Movie Updates, Movie Promotions, Branding Online and  Offline Digital Marketing Services

ప్రతి పది నిమిషాలకు మొదటి పది నిమిషాలు బాలేదు తర్వాత పది నిమిషాలు బాలేదు అంటూ సినిమా మొత్తం స్టోరీ రివీల్‌ చేసేస్తారు. అయితే సినిమాలే తీయడం మానేస్తే ఏం చేస్తారు.. ఇంట్లో కూర్చుంటే డబ్బులు ఎవరిస్తారు అంటూ సెటైర్లు వేసింది. నేను రివ్యూలు ఫాలో అవ్వనని.. రివ్యూ ఇచ్చేవారికి ఏం అర్హత ఉందని.. హాలీవుడ్లో రివ్యూ ఇచ్చే వారికి అర్హత ఉంటుంది. దాన్ని ఫాలో అవుతారు. కానీ మన దగ్గర ఎవరికీ అర్హత లేకుండా ఇంట్లో కూర్చుని వచ్చి సినిమా చూసి.. నేను రివ్యూ పెడతా అంటారు. అసలు ఎవరు వాళ్ళు.. వాళ్ళకి ఉన్న అర్హత ఏంటి.. సినిమా గురించి ఏం తెలుసు.. ఏం రైట్స్ ఉన్నాయని వారు రివ్యూ ఇస్తారు అంటూ ఫైర్ అయింది. సినిమా తీయడానికి ఎంత కష్టపడతామో ఇండస్ట్రీలో వారికి తెలుస్తుంది. అది అంత సులువు కాదు. రిలీజ్ అయ్యాక కొంత సమయం ఇవ్వండి.

ఓ ఐదు రోజులైనా గ్యాప్ ఇచ్చిన తరువాత ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. కానీ ముందే ఆడియన్స్ మైండ్ లోకి నెగటివ్ ని ఇంపాక్ట్ చేస్తే సినిమాకి రావాలని ఇంట్రెస్ట్ ఉండదు. అలా సినిమాలే ఆపేస్తే ఏం చేస్తారు ఒక సారి ఆలోచించండి. వ్యూవర్స్ గురించి నెగటివ్గా రివ్యూస్ ఇవ్వకండి అంటూ శబరి మూవీ ప్రమోషన్స్ లో వరలక్ష్మి శరత్ కుమార్ పేర్కొంది. ఇక శబరి మూవీ తల్లి కూతుర్ల సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతుంది. హిట్లు, ప్లాపులను ఎవరు జెడ్ చేయలేరు.. హనుమాన్, నాంది, కోట బొమ్మల పిఎస్ సినిమాలు అన్ని చిన్న సినిమాలుగా వచ్చి ఎలాంటి విజయాలు సాధించాయో అందరికీ తెలుసు. ఆ రేంజ్ లో సక్సెస్ వస్తుందని ఎవరు ఊహించలేదు. మేము ఒక డిఫరెంట్ సినిమా చేస్తున్నాం. ప్రేక్షకులకు కూడా ఈ సినిమా నచ్చుతుందని నమ్మకం నాలో ఉంది అంటూ వెల్లడించింది. ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.