తమన్నాకు ఊహించని షాక్.. సైబర్ క్రైమ్ పోలీసుల నోటీసులు.. ఏం జరిగిందంటే..?!

ప్రముఖ న‌టి.. టాలీవుడ్ స్టార్ బ్యూటీ తమన్నకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు రాష్ట్రాలతో పాటు పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు దాదాపు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ స్టార్ హీరోయిన్గా దూసుకుపోతుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటున్న మిల్కీ బ్యూటీ.. తాజాగా చిక్కుల్లో పడిందంటూ.. సైబర్ క్రైమ్ పోలీసులు నుంచి నోటీసులు అందాయి అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అసలు ఏం జరిగిందో.. తమన్నాకు సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు అందించడానికి కారణం ఏంటో.. ఒకసారి చూద్దాం. తమనకు మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు నుంచి నోటీసులు అందాయి.

Tamannaah Bhatia Roped In As The Lead In An Upcoming To Karan Johar OTT  Directorial

ఐపీఎల్ 2023 మ్యాచ్లను రూల్స్ కి విరుద్ధంగా ఫెయిర్ ప్లే యాప్.. లైవ్ చేసినందుకు ఈనెల 29న విచారణకు కావలసిందిగా సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు అందించారు. తమన్నా చేసిన పనికి కోట్లాది రూపాయల నష్టం వాటిలిందని.. ప్రసార హక్కులను సొంతం చేసుకున్న వయాకం ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులు ఆమెకు నోటీసులు అందించారు. ఐపీఎల్ డిజిటల్ ప్రచార హక్కులను వైయాకాం కొనుగోలు చేసింది. దీంతో వయాకం ఫిర్యాదు మేర‌కు మహారాష్ట్ర సైబర్ పోలీసులు ఫెయిర్ ప్లే యాప్ పై.. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ విషయంపై మరింత దర్యాప్తు చేసేందుకు తమన్నను విచారించడానికి సామాన్లు పంపారు. తమన్నా ఫెయిర్ ప్లే ను ప్రమోట్ చేసినందున ఆమెను సాక్షిగా విచారణకు పిలిచారని విశ్వసనీయ వర్గాలు సమాచారం.

Tamannaah Bhatia Summoned by Maharashtra Cyber in Illegal IPL Streaming  Case: Report | India.com

అయితే ఇదే కేసులో సీనియర్ నటుడు సంజయ్ దత్ కి కూడా నోటీసులు అందాయట. ఈనెల 23న ఆయన విచారణకు కావాల్సి ఉన్న హాజరు కాలేదు. ఆరోజు తను ముంబైలో లేనని వివరించారు. తన వాంగ్మూలాన్ని నమోదు చేసినందుకు మరో తేదీని సూచించాలని పోలీసులను కోరాడు. ఇక ఈ ఫెయిర్ ప్లే.. టాటా ఐపిఎల్ 2023 ని చట్ట విరుద్ధంగా ప్రదర్శించిన కారణంగా తమకు రూ.100 కోట్ల నష్టం వాటిల్లిందని వయాకం వారు ఇచ్చిన‌ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఈ కేసు విచారణలో.. ఫెయిర్ ప్లే వివిధ కంపెనీల ఖాతాల నుంచి ఈ సెల‌బ్రెటీల‌కు డబ్బులు ఇచ్చినట్లు పోలీసులకు తెలిసింది. కురాక్‌లో ఉన్న ప్లే వెంచ‌ర్‌ అనే కంపెనీ ఖాతా నుంచి సంజయ్ దత్ డబ్బు తీసుకున్నారు. లైకోస్ గ్రూప్ ఎఫ్‌జెడ్‌ఎఫ్ కంపెనీ ఖాతా నుంచి బాద్షా..

Fairplay App – Download & Install App for Online Sports Betting -  AppStoryOrg

డ్రీమ్ జనరల్ ట్రెండింగ్ ఎల్ఎల్‌సి అనే కంపెనీ ఖాతా నుంచి జాక్వలిన్ డబ్బు పొందారు. ఈ కంపెనీలు దుబాయ్ లో ఉండగా.. ప్లేయర్ ప్లే కాకుండా మహారాష్ట్ర సైబర్ అదే ఎఫ్‌ లో పికాసో అనే అప్లికేషన్ కూడా నిందితులుగా పేర్కొంది. ఇక ఈ అప్లికేషన్ google యాడ్ సెన్స్ నుంచి వచ్చే డబ్బు పాకిస్తాన్ కు వెళ్తున్నట్లు వెళ్లడయ్యింది. ఇక google నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ పికాసో అప్లికేషన్ లో అన్ని కొత్త సినిమాల, వెబ్ సిరీస్ ల పైరసీలు అందుబాటులో ఉన్నాయి. గూగుల్ ద్వారా ఈ అప్లికేషన్ లో ప్రకటనలని రసీద్ జునైద్ అనే వ్యక్తి పేరు మీద ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సైబర్ పోలీసులు ఇప్పుడా అప్లికేషన్ అన్నిటితో డబ్బు సంపాదించడానికి, వాటిని ఉపయోగించుకునే వారి అక్రమ మార్గాలను కనుగొనే ప్రయత్నంలో ఉన్నారు.