ఆల్ టైం రికార్డ్స్ బ్రేక్..పుష్ప 2 సాంగ్ ప్రోమోకి ఎన్ని వ్యూయ్స్ వచ్చాయంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా..? స్టైలీష్ స్టార్..ఆయన తాజాగా నటిస్తున్న సినిమా పుష్ప2. ఈ సినిమా కోసం జనాలు ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో మనకి బాగా తెలిసిన విషయమే . ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.

ఈ సినిమా కోసం బన్నీ చాలా కష్టపడుతున్నాడు . ఈ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోవడానికి బన్నీ చేయని పని అంటూ ఏమీ లేదు . సపరేట్ డైటీషియన్ పెట్టుకొని సినిమా కోసం లుక్స్ మార్చేసుకున్నాడు. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది. పుష్ప.. పుష్ప.. పుష్ప అంటూ సాగే లిరిక్స్ తో ఈ పాట అద్దిరిపోయే రేంజ్ లో ఉండబోతుంది అంటూ చిన్న ప్రోమో తోనే హింట్ ఇచ్చేశారు.

ఈ పాట మే 1న విడుదల కాబోతుంది . అయితే నిన్న విడుదల చేసిన 20 సెకండ్ల పుష్ప2 ప్రోమో సాంగ్ ద్వారా సంచలన రికార్డును నెలకొల్పాడు బన్నీ . 24 గంటలు కాకముందే 29 లక్షల వ్యూస్ వచ్చాయి లక్ష 66 వేలకు పైగా లైక్స్ సంపాదించుకుంది . ఇంతవరకు ఏ హీరో కూడా ఇలాంటి రికార్డ్ క్రియేట్ చేయకపోవడం గమనార్హం . బన్నీ తగ్గేదేలే అనే రేంజ్ లో దూసుకుపోతున్నాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!