సాయి పల్లవి – మహేష్ బాబు కాంబోలో మిస్సయిన మూడు సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే..!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబోస్ కోసం జనాలు ఎక్కువగా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు . అయితే అదృష్టమో దురదృష్టమో అలాంటి కాంబోలు సెట్ అవ్వడానికి చాలా చాలా టైం పడుతుంది . కొన్నిసార్లు అవి సెట్ కూడా కాకుండా పోవచ్చు. అలాంటి కాంబోలోకే వస్తుంది మహేష్ బాబు సాయి పల్లవి ల జంట . వీళ్ళ కాంబోలో సినిమాలు తెరకెక్కించడానికి డైరెక్టర్ లు చాలా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు .

కానీ ఆ సినిమాలు మాత్రం కమిట్ అవ్వలేకపోతున్నారు సాయి పల్లవి మహేష్ బాబు . వీళ్ళ కాంబోలో ఇప్పటివరకు మూడు సినిమాలు మిస్ అయ్యాయి . మూడు సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయిన మూవీసే కావడం గమనార్హం. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవి తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయింది .

అయితే ఈ సినిమాలో వరుణ్ పాత్రలో ముందుగా మహేష్ బాబుని అనుకున్నారట. కానీ మహేష్ బాబు ఇది ఫ్యామిలీ సెంటిమెంట్ డ్రామా అంటూ రిజెక్ట్ చేశాడట . ఆ తర్వాత సరిలేరు నీకెవ్వరు సినిమాలో రష్మిక ప్లేస్ లో సాయి పల్లవి నటించాల్సి ఉన్నింది. ఆమె రిజెక్ట్ చేసింది. గుంటూరు కారం లో పూజ హెగ్డే ను తప్పించిన తర్వాత సాయి పల్లవి అని అనుకున్నారట . కానీ ఆమె కూడా ఈ పాత్ర రిజెక్ట్ చేయడంతో మళ్ళీ వీళ్ళ కాంబోలో మంచి సినిమా మిస్ అయినట్లు అయింది..!!