SSMB -28 కోసం సీనియర్ నటి..!!

డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాబినేషన్లో వస్తున్న మూడవ చిత్రం కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాకి కేవలం వర్కింగ్ టైటిల్ కింద SSMB -28 అని మాత్రమే పెట్టారు. ఇందులో పూజ హెగ్డే , శ్రిలీల నటించబోతున్నట్లు నిర్మాత నాగ వంశీ తెలియజేశారు. అయితే ఈ సినిమాలోని ఒక కీలకమైన పాత్ర కోసం సీనియర్ నటి శోభనాను త్రివిక్రమ్ శ్రీనివాస్ సంప్రదించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆమె ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకోకపోతే ఇందుకోసం మరొక పాత హీరోయిన్ ని ఎంచుకోవాలని భావిస్తున్నట్లుగా సమాచారం.

SSMB 28 shoot commences on and film releases on?
అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి 18వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నట్లు ప్రొడ్యూసర్ నాగవంశీ తెలియజేశారు. అయితే ముందుగా యాక్షన్ ఎపిసోడ్ తో ఈ సినిమా మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం. వచ్చే నెలలో మరింత స్పీడ్ గా ఈ సినిమాని పూర్తి చేసేందుకు సన్నహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ మొదలయ్యి ఇప్పటికీ కొన్ని నెలలు పైన కావస్తోంది. కానీ కొన్ని కారణాల చేత ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కాగుతుంది ఎట్టకేలకు సంక్రాంతి పండుగకి ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు.

Shobana's 'Leap Like A Deer' dance video is too beautiful to miss; watch -  Zee5 News

ఏడాది ఆగస్టు 11వ తేదీన ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా మహేష్ బాబు కెరియర్ లో ఎలాంటి మలుపు తిప్పుతుందో తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే అలాగే ఈ సినిమాలో హీరో హీరోయిన్ల తర్వాత కీలకమైన పాత్రలో ఎవరు నటిస్తారనే విషయం చిత్ర బృందం తెలియజేయవలసి ఉంది.