రౌడీ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. విజయ్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ పై ఫుల్ క్లారిటీ..!

టాలీవుడ్ యంగ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజయ్ దేవరకొండ ఇటీవలే ఫ్యామిలీ స్టార్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. ఈ మూవీని పరుశురామ్ తెరకెక్కించగా హీరోయిన్గా మృణాల్ ఠాగూర్ కనిపించారు.

మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ పర్వాలేదనిపించి విజయం అందుకుంది. ఇక ప్రస్తుతం గౌతమ్ తిననూ రితో ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నారు విజయ్. విషయం ఏమిటంటే, క్రేజీ ఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్‌ తో విజయ్ దేవరకొండ ఒక మూవీ చేయనున్నారనే న్యూస్ నేడు ఉదయం నుండి పలు వీడియో మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతుంది.

నిన్న ఒక ముఖ్య పని మీద హైదరాబాద్ వచ్చిన ప్రశాంత్, ఆ సందర్భంలో విజయ్ ని కలిసారని ఆ సమయంలో వీరిద్దరి కాంబో మూవీ కథ చర్చలు జరిగాయని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని, వారి ఇద్దరి కలయిక సాధారణంగానే జరిగిందని విజయ్ టిమ్ క్లారిటి ఇచ్చినట్లు తెలుస్తుంది.