అనిమల్ 2 పై క్రేజీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పటినుంచే..!

బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా మన తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిన భారీ చిత్రమే “అనిమల్” మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం వాటిని అందుకుని దర్శకుడు, హీరోలా కెరియర్ లోనే అత్యధిక వసూళ్ళని సాధించి రికార్డు సెట్ చేసింది.

ఇక ఈ చిత్రానికి రెండో భాగం “అనిమల్ పార్క్ 2” ని కూడా అనౌన్స్ చేయటంతో దీనిపై కూడా భారీ అంచనాలు నెలకున్నాయి. అయితే ఈ సినిమా పై లేడెస్ట్ గా దర్శకుడు సందీప్ వంగా క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా 2026 లో మొదలవుతుంది అని అలాగే ఈ సినిమా మొదటి సినిమా కంటే చాలా వైల్డ్ గా ఉంటుంది అని చెప్పారు.

దీనితో యానిమల్ 2 ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఇక మొదటి భాగంలో తృప్తి దిమ్రి, అనిల్ కపూర్, పృథ్వి రాజ్, బాబి డియోల్ తదితరులు ముఖ్య పాత్రలో నటించగా హర్ష వర్దన్ రామేశ్వర్ బ్యాక్లాండ్ స్కోర్ ని అందించాడు. అలాగే టి సిరీస్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహించారు.