ఇలియానా అంత మాట అనేసింది ఏంటి..? మొగుడు వదిలేశాడా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్స్ కూడా పరోక్షంగా తమ లైఫ్ కి సంబంధించిన విషయాలను అభిమానులతో ఓపన్గా చర్చించడానికి ఇష్టపడుతున్నారు. మరీ ముఖ్యంగా కొందరు ఫెడవుట్ హీరోయిన్స్ తాము గతంలో ఎలా ఉన్నాము..? ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము అన్న విషయాలను ఓపెన్ గా చెప్పుకొస్తున్నారు . తాజాగా సోషల్ మీడియాలో ఇలియానా పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. దానికి కారణం ఆమె తాజాగా చేసిన ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలే అంటూ తెలుస్తుంది . ఇలియానా గతంలో ఎన్నోసార్లు మానసికంగా అలసిపోయాను అంటూ స్టేట్మెంట్స్ ఇచ్చింది . లైఫ్ చాలా డిస్టర్బ్ గా ఉంది అంటూ కూడా చెప్పుకొచ్చింది.

అయితే తాజా ఇంటర్వ్యూలో మాత్రం ఇలియానా చాలా హ్యాపీగా ఉన్నాను అని లైఫ్ లో ఏం కావాలో అన్ని దక్కించుకున్నాను అని చెప్పుకొచ్చింది . చాలా టైం గ్యాప్ తీసుకొని ఇలియానా చేసిన సినిమా “దో ఓఉర్ దో ప్యార్”. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొనింది . అప్పుడే తనకి ఈ సినిమా ఆఫర్ ఎలా వచ్చిందో అని చెప్పింది. ఈ సినిమాలో తాను నటించిన నోరా పాత్ర తనకు చాలా చాలా బాగా నచ్చింది అని.. నిజం చెప్పాలంటే రియల్ లైఫ్ లో నాకు బాగా సింక్ అవుతుందని .. అందుకే మేకర్స్ అడగ్గానే ఓకే చెప్పేసాను అని చెప్పుకొచ్చింది.

అంతేకాదు ఈ సినిమా కోసం మేకర్స్ తనకు బాగా సపోర్ట్ చేశారంటూ కూడా చెప్పుకు వచ్చింది . అయితే అంత హ్యాపీగా అంతా జాలిగా గడుపుతున్న ఇలియానా మానసికంగా అలసిపోయాను అంటూ గతంలో స్టేట్మెంట్ ఇవ్వడం పై ఫాన్స్ కొత్త డౌట్లు వ్యక్తం చేస్తున్నారు. బహుసా ఇలియానా భర్త ఆమెను వదిలేయబోతున్నాడా..? అందుకే ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చిందా ..?అంటూ రకరకాల క్వశ్చన్స్ తో కన్ఫ్యూజ్ మైండ్ తో కామెంట్స్ చేస్తున్నారు..!!