వీరసింహారెడ్డిలో అదిరిపోయే హైలెట్ లీక్‌… విజిల్స్‌కు ఇక బ్రేక్ ఉండ‌దు..!

నందమూరి బాలకృష్ణ సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే.. ఆయన సినిమాలో వచ్చే యాక్షన్ సన్నివేశాలకు ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. బాలకృష్ణ ఫ్యాక్షన్‌ సినిమాలకు పెట్టింది పేరు. అయ‌న‌ సినిమాలు వస్తున్నాయి అంటే థియేటర్లు మారు మోగిపోవాల్సిందే. ఇప్పుడు అలా త్వరలోనే థియేటర్లను మారు మోగించడానికి బాలకృష్ణ వచ్చేస్తున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వస్తున్న సినిమా వీర సింహారెడ్డి.

Veera Simha Reddy: కటౌట్ రేంజ్ పోస్టర్ సర్… - NTV Telugu

ఈ సినిమాకు సంబంధించిన ప్రోమోలు, టీజర్లు చూస్తుంటే ఈ సినిమాపై అంచనాలు మరో లెవల్ కు వెళ్తున్నాయి. తాజా సమాచారం ఏమిటంటే ఈ సినిమాలో ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది. బాలకృష్ణ గతంలో నటించిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాల లాగానే ఈ వీర సింహారెడ్డి లో కూడా మనసును హత్తుకునే కుటుంబ సన్నివేశాలు ఉండబోతున్నాయట. ఇక బాల‌య్య యాక్ష‌న్ స‌న్నివేశాల‌కు గూస్‌బంప్స్ మాత్ర‌మే కాదు విజిల్స్‌తో థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోతాయ‌ట‌.

Veera Simha Reddy Hunt Trailer | Nandamuri Balakrishna | Shruti Haasan |  Gopichandh Malineni | - YouTube

ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్- బాలకృష్ణ మధ్య జరిగే సన్నివేశాలు మాత్రం ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేసి కంటతడి పెట్టించేలా ఉండబోతున్నాయి. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర ఎంతో కీలకంగా ఉండబోతుందట. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి మూడు పాటలు చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా.. ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఈ సినిమాలో బాలకృష్ణకు జంటగా శృతిహాసన్ నటించింది. ఈ సినిమాను జనవరి 12న‌ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.