రూ. 100 కోట్ల ఆఫ‌ర్‌.. వ‌ద్దు పొమ్మ‌న్న రాజ‌మౌళి!?

బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్‌ గా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి `ఆర్ఆర్ఆర్‌` సినిమాతో ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు పొంద‌రు. పైగా ప్రస్తుతం ఆస్కార్ బ‌రిలో ఆర్ఆర్ఆర్ ఉండ‌టంతో జక్కన్న పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఇలాంటి తరుణంలో ఆయనకు ఓ బిగ్ ఆఫర్ వచ్చిందట.

ప్రముఖ దిగ్గ‌జ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ వారు ఇంగ్లీష్ లేదా ఏదైనా భాషలో వెబ్ సిరీస్ తెరకెక్కించాలని రాజమౌళిని సంప్ర‌దించార‌ట‌. అందుకుగానూ నెట్ ఫ్లిక్స్ వారు ఏకంగా 100 కోట్లు ఆఫర్ చేశారట. కానీ రాజమౌళి మాత్రం వద్దు పొమ్మన్నారట. `ఆర్ఆర్ఆర్‌` అనంతరం దర్శకధీరుడు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో ఓ మూవీని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం తన దృష్టి మొత్తం ఆ మూవీ పైనే ఉందని.. తాను ఎలాంటి వెబ్ సిరీస్ తెరకెక్కించలేనని రాజమౌళి చెప్పేశారట. దీంతో చేసేదేమి లేక నెట్ ఫ్లిక్స్ వారు వెనుతిరిగారని ఓ న్యూస్ నెట్టింట‌ వైరల్ గా మారింది. ఏదేమైనా రూ. 100 కోట్ల ఆఫర్‌ను రాజమౌళి వదులుకోవడం ఇప్పుడు హాట్‌ టాపిక్ గా మారింది. కాగా, మహేష్ సినిమా విషయానికి వస్తే విజయేంద్ర ప్ర‌సాద్ క‌థ‌ అందిస్తున్న ఈ సినిమా అడ్వెంచర్ డ్రామాగా రాబోతోంది. వచ్చే ఏడాది ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.