ఎన్టీఆర్‌కు విలన్‌గా ఆ స్టార్ హీరోను ఒప్పించారా… పాన్ వ‌ర‌ల్డ్ హిట్ ప‌క్కా…!

ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో అదిరిపోయే పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్నాడు. తన తర్వాతి సినిమాలను కూడా పాన్ ఇండియా లెవెల్ ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాడు తారక్. త‌న 30వ సినిమాను స్టార్ దర్శకుడు కొరటాల శివతో పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా సంక్రాంతి నుంచి మొదలుకానుందని తెలుస్తుంది. అయితే ఎన్టీఆర్- కొరటాల మూవీ తర్వాత కేజీ ఆఫ్ సినిమాలతో పాన్ ఇండియా దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్‌తో తన 31వ సినిమా చేయబోతున్నాడు.

ప్రస్తుతం ప్రశాంత్ ప్రభాస్‌తో సలార్ మూవీ షూటింగ్‌లో బిజీగాా ఉన్నాడు. ఈ సినిమా పూర్తియ‌న‌ వెంటనే ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన పనులను మొదలుపెట్టనున్నాడట. అయితే ఇప్పుడు ఎన్టీఆర్‌- ప్రశాంత్ నీల్ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఒకటి బయటికి వచ్చింది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు విలన్ గా సంజయ్ దత్ ను ప్రశాంత్ ఎంపిక చేస్తారట. ఇక ఎన్టీఆర్ 31వ సినిమా కథ మొత్తం విన్నాక.. ఈ స్టోరీకి నేను సరిపోను ఇది నెక్స్ట్ లెవెల్ స్టోరీ.. విలన్ పాత్రలో తాను న్యాయం చేయలేనని సంజయ్ దత్ చెప్పేసాడట.

ఈ సినిమాకు విలన్ గా సల్మాన్, అమీర్ ఖాన్ వంటి హీరోలైతేయితే సరిపోతారని ఆయన చెప్పడంతో.. ప్రశాంత్ నీల్ సంజయ్ దత్ చెప్పిన సలహాతో అమీర్ ఖాన్ కు ఈ సినిమా కథ చెప్పాడ‌ట‌. అమీర్‌కు స్టోరీ నచ్చడంతో ఓకే మాటతో ఈ సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ చేయడానికి ఓకే చెప్పేసాడట. ఎన్టీఆర్ 31వ సినిమాలో విలన్ గా అమీర్ ఖాన్ దాదాపు కన్ఫామ్ అయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త బయటకు రావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మా హీరో సినిమా ప‌క్కా పాన్ వ‌ర‌ల్డ్ హిట్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

అయితే నిజానికి ఇప్పటి వరకు ఎవరు కూడా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనప్పటికీ.. ఈ రూమర్ విన్న ప్రశాంత్ నీల్, అమీర్ ఖాన్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం తెగ ఎగ్జైట్ అవుతున్నారు. అయితే ఈ పాత్రపై చిన్న లీకులు కూడా వస్తున్నాయి. 1990లో అరబ్ దేశాల నుండి భారత ప్రభుత్వాన్ని గడగడలాడించిన మాఫియా డాన్ పాత్రలో అమీర్ ఖాన్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అంతర్జాతీయ గోల్డ్ స్మగ్లింగ్ ఆధారంగానే ఎన్టీఆర్ 31వ సినిమా కూడా తెరక్కనున్నట్టు రూమర్స్ వస్తున్నాయి.