టాలీవుడ్ లో బాలయ్యకు ఉన్న క్రేజ్ స్పెషల్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక బాలయ్య ప్రేమను తట్టుకోవడం కాస్త కష్టమేనని అప్పుడప్పుడు పలు సందర్భాలలో అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆన్ స్క్రీన్ ,ఆఫ్ స్క్రీన్ ఏదైనా సరే ఆయన రూటే సపరేట్గా ఉంటుంది. బాలయ్య ని బయటనుంచి చూస్తే కోపం ఎక్కువగా ఉన్న వ్యక్తు లా కనిపిస్తారు. ఇక ఆయన్ని దగ్గరనుంచి చూస్తే అసలు విషయం తెలుస్తుందని కొంతమంది సినీ ఇండస్ట్రీలో ఉండే ప్రముఖుల సైతం తెలియజేస్తూ ఉంటారు. ప్రస్తుతం బాలయ్య హీరోగా, హోస్టుగా, ఎమ్మెల్యేగా ప్రజలకు బాగా సేవలందిస్తున్నారు.
గతంలో ఎన్నోసార్లు బాలయ్య పైన సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం జరిగింది. అలా ఎంతో మంది విమర్శలు చేసిన సరే బాలయ్య తన రూల్స్ ను మాత్రం మార్చుకోరు. తాజాగా రైటర్ సాయి మాధవ్ బుర్ర బాలయ్య గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.
హీరోలందరూ బౌసర్లను ఎందుకు పెట్టుకుంటారు.. ఫ్యాన్సీని నెటేందుకు కొట్టేందుకే కదా..! నిన్నగాక మొన్న వచ్చిన చిన్న హీరోలు కూడా బౌసర్లను పెట్టుకుంటున్నారంటు..నా ఫ్యాన్స్ ని కొట్టేందుకు డబ్బులు ఇచ్చి బౌన్సర్లను పెట్టుకోవాలా..నేను ఆ పని చేయను ఫాన్స్ నాకు ఫ్యామిలీతో సమానం అలాంటి వారిని కొట్టేందుకు వారెవరు అంటూ.. బాలయ్య దెబ్బ వేస్తాను వాళ్లకు కోపం వస్తే నా మీదకు వస్తారు అంతే తప్ప బౌన్సర్లు ఎవరు..? నేనేంటో నా ఫ్యాన్స్ కు మాత్రమే తెలుసు అంటూ బాలయ్య తనతో చెప్పినట్లుగా సాయి మాధవ్ బుర్ర రివీల్ చేశారు. ఈ విషయం విన్న బాలయ్య అభిమానులు ఆయనను అభినందిస్తూ ఉన్నారు. అందుకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతోంది.
That's Nandamuri Balakrishna for u❤️#VeeraSimhaReddy #NBK pic.twitter.com/cjgSEmybHt
— Balayya Trends (@NBKTrends) December 29, 2022