అడ్వాన్స్ బుకింగ్స్ లో `వీర సింహా రెడ్డి` జోరు.. `వీర‌య్య‌` బేజారు!

వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నరసింహం నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ `వీర సింహారెడ్డి` సినిమాతో రాబోతుంటే.. చిరంజీవి `వాల్తేరు వీరయ్య`తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ రెండు చిత్రాల్లోనూ శ్రుతిహాసన్‌నే హీరోయిన్గా నటించింది.

పైగా ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ వారే నిర్మించడం విశేషం. జనవరి 12న వీర సింహారెడ్డి విడుదల కాబోతోంది. అలాగే జనవరి 13న వాల్తేరు వీరయ్య థియేర్స్ లో సందడి చేయబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ రెండు సినిమాల నుంచి పోటా పోటీగా అప్డేట్స్ బయటకు వస్తున్నాయి. రీసెంట్ గా అమెరికాలో ఈ రెండు సినిమాలకు బుకింగ్స్ ప్రారంభించారు.

 

అయితే అడ్వాన్స్ బుకింగ్స్ లో వీర‌ సింహారెడ్డి య‌మా జోరు చూపిస్తే.. వాల్తేరు వీర‌య్య బేజారు అయింది. 132 షోస్ కి గాను వీర సింహా రెడ్డి చిత్రానికి 40 వేల డాలర్స్ రాగా , వాల్తేరు వీరయ్య చిత్రానికి కేవలం 26 వేల డాలర్లు మాత్రమే వచ్చింది. ఈ భారీ వ్యత్యాసాన్ని చూసి అభిమానులే కాదు సినీ ప్రియులు కూడా షాక్ అయిపోతున్నారు. మ‌రి రాబోయే రోజుల్లో అయినా ఓవర్సీస్ అడ్వాన్స్ బుక్కింగ్స్ లో వాల్తేరు వీరయ్య హవా చూపిస్తుందా..లేదా.. అన్న‌ది చూడాలి.