ప్రముఖ టాలీవుడ్ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఒక తెలుగులోనే కాకుండా పలు రకాల భాషలలో కూడా మహేష్ బాబుకి మంచి క్రేజ్ ఉంది. మహేష్ సినిమాలలోనే కాకుండా నిజ జీవితం కూడా దాతృతమైన పనులు చేస్తూ రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. చాలా ఆయన గురించి అన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా అవేమీ పట్టించుకోకుండా ఆయనకి నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కెరీర్ పరంగా మంచి హిట్స్, రియల్ లైఫ్ లో చక్కని బిహేవియర్‌తో అభిమానులను పెంచుకుంటూ పోతున్నాడు. మహేష్‌కి ఉన్న ఫాన్ ఫాలోయింగ్ చూసి ఇతర హీరోలు ఈర్ష్య పడుతూ ఉంటారు.
అయితే తాజాగా మహేష్ ఒక వేడుకకు హాజరయ్యాడు. గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ, వ్యాపారవేత్త రవిల రిసెప్షన్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకి అల్లు అర్జున్, మహేష్ బాబు ఇచ్చేశారు. అక్కడ అల్లు అర్జున్ కుమార్తె అర్హని మహేష్ పలకరించి ఆమె బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నాడు. దాంతో మహేష్ చాలా గ్రేట్ అని, ఆయన తన విలువైన సమయాన్ని బన్నీ కూతురితో మాట్లాడేందుకు కేటాయించారని ఫ్యాన్స్ పొగుడుతున్నారు.
మహేష్ తన తండ్రి చనిపోయిన బాధ నుండి చాలా నెమ్మదిగా బయటికి వస్తున్నాడు. కమిట్ అయిన సినిమాల షూటింగ్స్ లో పాల్గొనడానికి రెడీ అవుతున్నాడు. ఇక మహేష్ త్వరలోనే త్రివిక్రమ్ డైరెక్షన్లో ఒక సినిమా స్టార్ట్ చేయనున్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలిల హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీలైనంత త్వరగా సినిమా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారట.