ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలో సినిమాలు కమిట్ అయ్యే విదనం చూస్తుంటే కొంత అశ్చర్యంగా అనిపిస్తుంది. ఓ దర్శకుడు తో సినిమా కమీట్ అయ్యి తర్వాత మధ్యలో సినిమా అగిపోంది అనే మాట రానీయకుండా అదే కాంబినేషన్ ఉంటోంది, కథ మాత్రం మారిపోతోంది. అంటే, పాక్షికంగా ప్రాజెక్టును రద్దుచేసి, ఫ్రెష్ గా మరో సినిమాను మొదలు పెడుతున్నరు.
టాలీవుడ్ లో ఈ ట్రెండ్‌ను ముందుగా మహేష్ బాబు మొదలు పెట్టడు. మహేష్ తన 28వ సినిమాను త్రివిక్రమ్ తో చేస్తున్నడు. అయితే త్రివిక్రమ్ ముందుగా చెప్పిన కథకు ఆయన ఓకే చెప్పాడు. కథకు కాల్షీట్లు కూడా కేటాయించాడు. ఓషెడ్యూల్ కూడా పూర్తి చేశాడు. అంతలోనే మహేష్ మనసు మారిపోయింది. త్రివిక్రమ్ చెప్పిన కథను వద్దని కోత్త కథ తో రామ్నడు.
అప్పుడు త్రివిక్రమ్ అప్పటికప్పుడు కోత్త కథ సిద్ధం చేశాడు. ఇప్పుడు ఆ కొత్త కథతోనే ఈ సినిమా షూటింగ్ జనవరి నుంచి మొదలుపెట్టనున్నారు. అయితే ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా మహేష్ రూట్‌లోనే గతంలో హరీశ్ శంకర్ చెప్పిన కథకు ఓకే చెప్పిన పవన్. దాంతో మైత్రీ మూవీ మేకర్స్ ప్రాజెక్టును ఆనౌన్స్ చేయగా. భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ తో పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. తర్వాత పవన్ కు హరీశ్‌కు కొంత గ్యాప్ రాగా మధ్యలో అయన మనసు మారిపోయింది.
అప్పడు హరీశ్ చెప్పిన కథను కాదని ఇప్పుడు మరో కోత్త కథతో హరీశ్ శంకర్‌తో మరో కోత్త సినిమాను మొదలు పెట్టడు. ఇక దీనికి ఉస్తాద్ భగత్ సింగ్ అనే టైటిల్ పెట్టారు. పాత కథకు కొంత మార్పులు చేశారా..? కొత్త కథతో వస్తున్నారా..? అనే విషయం పక్కనపెడితే.. మహేష్ లానే పవన్ కూడా మొత్తం ప్రాజెక్టును పక్కనపెట్టకుండా, ఇలా మార్పుచేర్పులతో ముందుకెళ్తున్నాడు.