తండ్రి కాబోతున్న రామ్ చరణ్.. చిరంజీవి పోస్ట్ వైరల్..!

మెగా ఫ్యామిలీలో వారసుడి కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. నిజానికి ఉపాసన రాంచరణ్ ల వివాహం 2012లో జరిగింది. ఇటీవల 10వ సంవత్సరాన్ని కూడా పూర్తి చేసుకున్నారు. అయితే 10 సంవత్సరాల వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉండే ఈ జంట ఏ రోజు కూడా విమర్శలు ఎదుర్కోలేదు. కానీ ఇటీవల పెళ్లయి పదేళ్లు అవుతున్న ఇంకా పిల్లలు కాలేదేంటి అంటూ రకరకాలుగా వార్తలు వినిపిస్తుండడం గమనార్హం. కానీ ఎట్టకేలకు రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు అంటూ చిరంజీవి తన ట్విట్టర్ అధికారిక ఖాతా ద్వారా పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా విపరీతంగా లైకులు సొంతం చేసుకుంది.

Ram Charan and Upasana Kamineni Konidela expecting their first child |  PINKVILLA

శ్రీ హనుమాన్ జీ ఆశీస్సులతో ఉపాసన – రాంచరణ్ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు అంటూ ఆయన ఈ పోస్ట్ చేయడం గమనార్హం. ఈ విషయం తెలిసి అటు మెగా అభిమానులు ఇటు రాంచరణ్ అభిమానులు వర్షం వ్యక్తం చేస్తున్నారు . అంతేకాదు పలువురు సెలబ్రిటీలు కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మొత్తానికి అయితే ఉపాసన తల్లి కాబోతోందని తెలిసి ఇరు కుటుంబాలలో ఆనందాలు వెళ్లి విరుస్తున్నాయి. రామ్ చరణ్ విషయానికి వస్తే.. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాంచరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

Good news in Ram Charan's personal life - celebration begins - News -  IndiaGlitz.com

ఈ సినిమా విడుదలైన తరువాత బుచ్చిబాబు సనా తో తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నారు. మరి ఈ సినిమాలు ఎలాంటి విజయాన్ని అందుకుంటాయో ఏమో తెలియదు కానీ ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న కోరిక మాత్రం నెరవేరుతుండడంతో ఆయన ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు.

https://twitter.com/AlwaysRamCharan/status/1602232761305423872?s=20&t=fuz8CwwRttnEIgdTuIKl5w