టాలీవుడ్ బ్యూటీ ప్రణీత సుభాష్ తన నటనతో కొంతకాలం పాటు అభిమానులను అల్లరించింది. ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో నటించింది. ఈ సినిమాతో ప్రణీతని అందరూ బాపు బొమ్మ అని పిలవడం మొదలు పెట్టారు. ఈ అమ్మడు తమిళ సినిమాల్లో కూడా నటించింది కానీ విజయం సాధించలేకపోయింది.
టాలీవుడ్‌లో అత్తారింటికి దారేది, రభస, బ్రహ్మోత్సవం లాంటి చిత్రాలో నటించింది. అయితే గత ఏడాది బెంగుళూరుకి చెందిన ఒక వ్యాపారవేత్తని పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ ఒక బిడ్డ కి జన్మనిచ్చింది. ప్రస్తుతం ప్రణీత తన ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది.
ప్రణీత వివాహం తరువాత కూడా తన అభిమానుల కోసం సోషల్ మీడియాలో గ్లామర్ ట్రీట్ చేస్తూనే ఉంది. తాజాగా ప్రణీత టైట్ జీన్స్, స్లీవ్ లెస్ టీషర్ట్ వేసుకొని క్యూట్ పోజుల్లో ఫొటోలు దిగింది. ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె బొడ్డు అందాలను చూపిస్తున్న ఈ ఫొటోలు కుర్రాళ్ల గుండెలో వేడి పుట్టిస్తున్నాయట. ఇంకో ఫొటోలో బ్లూ జీన్స్ వేసుకొని లైట్ బ్లూ టీషర్ట్ వేసుకొని ఒళ్లు విరిస్తూ తన బొడ్డు, నడుము అందాలను చూపిస్తుంది.
ప్రణీత గ్లామర్ ఫోటోలు చూసిన వాళ్లంత ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతుందేమోనని అభిప్రాయపడుతున్నారు. దానికోసమే ఇలా తన గ్లామరస్ అందాలను అరబోస్తుంది అని నెటిజనులు కామెంట్స్ చేస్తున్నారు.