పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఎంతో కీలకంగా మారారు. ఆయన 2019లో వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. ఆయన రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి నిదానంగానే సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కువగా రీమేక్ సినిమాలను పవన్ కళ్యాణ్ ఎంచుకుంటూ రాజకీయాలకు ఎక్కువ టైం కేటాయిస్తుండటంతో ఆయన సినిమాలు రిలీజ్ కావడానికి ఆలస్యం అవుతుంది.
పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను ప్రకటిస్తున్నా ఆ సినిమా షూటింగ్‌లు ఎప్పుడు ప్రారంభమవుతాయో ఎవరికీ అర్థం కావట్లేదు. అయితే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటికి వచ్చింది. పవన్ అభిమానులు షూటింగ్ విషయంలో ప్రభాస్ ను ఫాలో అవ్వాలని పవన్ కు సోషల్ మీడియా ద్వారా కామెంట్‌లు పెడుతున్నారు. దీనికి కారణం ప్రభాస్ ఒకే సమయంలో రెండు లేదా మూడు సినిమాలుకు డేట్లు ఇస్తున్నాడు.
ఇలా డేట్లు ఇస్తూ.. ప్రతి నెలలో ఒక్కో సినిమాకు పది రోజులు కేటాయించేలా ప్రభాస్ ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే మిగిలిన రోజుల్లో ఇతర ఆర్టిస్టులకు సంబంధించిన సన్నివేశాలు, సెట్స్ వర్క్ జరుగుతున్నాయి. ఇలా చేస్తే ఒకే సంవత్సరంలో ప్రభాస్ నటించిన మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. పవన్ కూడా వేగంగా సినిమాలలో నటిస్తే ప్రభాస్ లాగా ఒకే సంవత్సరం రెండు లేదా మూడు సినిమాలతో అభిమానుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
వరుస సినిమాలను ఒప్పుకుంటున్న పవన్ అంతే స్పీడ్ గా షూటింగ్‌లను కూడా పూర్తి చేసి సినిమాలను రిలీజ్ చేస్తే వారి అభిమనుల ఆనందానికి అవధులు ఉండవు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా ప్రస్తుతం నటిస్తున్న హరిహర వీరమల్లుకు కూడా రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతుంది.
పవన్ కళ్యాణ్ తాను నటించే సినిమాకు 50 నుంచి 70 కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ తో సినిమాలు తీయడానికి కూడా నిర్మాతలు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. అయితే 2024 ఎన్నికల తర్వాత పవన్ సినిమా కెరియర్‌ను కొనసాగిస్తారా లేక సినిమాలకు గుడ్ బాయ్ చెప్పి రాజకీయాల్లోనే కొనసాగుతారా అనేది తెలియాల్సి ఉంది.