ఎన్టీఆర్ తో రజిని బంధం ఎలాంటిదో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళంలో ఉన్న క్రేజ్ ఎంత చెప్పినా తక్కువే ముఖ్యంగా ఇతర భాషలలో సైతం రజనీకాంత్ సినిమాలు విడుదల కాబోతున్నాయి అంటే చాలు ఎంత హడావిడి ఉంటుందో తెలిసిన విషయమే. మొదట బస్ కండక్టర్గా చేసిన రజినీకాంత్ సినిమాల మక్కువతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. రజనీకాంత్ ఎక్కువగా ఎన్టీఆర్ సినిమాలనే చూసేవారట అలా ఎన్టీఆర్ నటించిన పారాణిక చిత్రాలు అంటే రజనీకాంత్ కు చాలా ఇష్టమట.

Confident that Telugu audience will like Kaala, says Rajinikanth, remembers  NTRఇక తన అభిమాన నటుడు ఎన్టీఆర్ తో కలిసి రజనీకాంత్ టైగర్ సినిమాలో నటించారు 1979లో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని నందమూరి రమేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో తాను ఎన్టీఆర్ను ఎంతలా అభిమానించే విషయాన్ని పదేపదే ఇంటర్వ్యూలో తెలియజేశారట రజనీకాంత్. అంతేకాకుండా ఎన్టీఆర్ దర్శకత్వంలో శ్రీకృష్ణునిగా నటించాలని కోరిక కూడా ఉన్నదట రజనీకాంత్ కు. రజనీకాంత్ అప్పట్లో ఎక్కువగా సమయం దొరికితే చాలు మందు కొట్టే వారట ఈ విషయం ఎన్టీఆర్కు తెలిసి బ్రదర్ మీకు చాలా భవిష్యత్తు ఉంది ఈ మందు అలవాటును మానుకోండి అని సలహా ఇచ్చారట.

Heytamilcinema on Twitter: "SUPERSTARS - #Chiranjeevi #Rajinikanth #NTR |  Very rare picture ! https://t.co/ixabl9hCqr" / Twitter
ఈ అలవాటు నుంచి రజనీకాంత్ బయటపడడానికి యోగ , ప్రణాయామం వంటివి చెప్పారట అంతకుముందు యోగాభ్యాసం చేస్తున్న ఎన్టీఆర్ సలహా ఇచ్చిన తరువాత సీరియస్గా రజనీకాంత్ వాటిని పాటించడంతో ఆ మార్పు వల్ల ..అనూహ్యంగా తమిళనాడులో సూపర్స్టార్ గా మారిపోయారు. రజనీకాంత్ ఎక్కువగా హిమాలయాలలోకి వెళ్లి బాబాను దర్శించుకుని వస్తూ ఉండేవారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డు రజనీకాంత్ ఎంపిక చేయడం జరిగింది. దీంతో ఎన్టీఆర్ రజనీకాంత్ మధ్య ఎంతటి బంధం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని చెప్పవచ్చు.