ప్రముఖ నటి రష్మిక ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ అమ్మడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి పుష్ప సినిమా బాగా పనికొచ్చింది. బాలీవుడ్‌లో అవకాశాలు రావడంతో సౌత్‌ని పట్టించుకోడం మానేసింది ఈ భామ. అంతేకాకుండా, కాంతార సినిమా చూడలేదు అంటూ కామెంట్స్ చేసింది. దాంతో ఈ మధ్య కాలంలో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక రెండు విషయాల గురించి బాగా చర్చలు జరుగుతున్నాయి. వాటిలో ఒకటి రష్మికని కన్నడ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయడం, మరొకటి కాంతార సినిమా సక్సెస్.
అయితే కాంతారా సినిమాని చూడలేదని చెప్పిన సమయం నుంచి రష్మికను చాలామంది విమర్శిస్తూ వస్తున్నారు. ఇక ఈమధ్య విమర్శలతో పాటు ఆమెకు మద్దతు ఇచ్చే వారు కూడా పెరిగిపోతున్నారు. కన్నడ ఇండస్ట్రీ ఆమెను బ్యాన్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న వేళ ఈ విషయంపై రష్మిక ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసింది. ఇక శాండిల్ వుడ్ ఆమెని నిషేధం ప్రకటించిన విషయాన్ని కూడా ఆమె కొట్టి పారేసింది. అలానే కన్నడ ఇండస్ట్రీ ఆమెపై ఎలాంటి నిషేధం విధించలేదని చెప్పింది.
ఈ తరుణంలో పుష్ప సినిమాలో నటించిన ధనుంజయ రష్మికకు మద్దతుగా నిలిచాడు. బ్యాన్ చేయడమంటూ ఏదీ ఉండదని, ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికీ చోటు ఉంటుందని, కష్టపడకుండా ఎవరూ సక్సెస్ కాలేరని అతను చెప్పుకొచ్చాడు. రష్మికపై విమర్శలు చేయడం, ఆమె చేసిన వ్యాఖ్యలపై చర్చ జరపడం అనవసరమని అన్నాడు.