ఇక నావల్ల కాదు.. సమంత అభిమానులకు గుండె పగిలిపోయే అప్డేట్…!

సౌత్‌ సెన్సేషన్ సమంత రూత్ ప్రభు ప్ర‌స్తుతం మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్న విష‌యం తెలిసిందే. స‌మంత ఈ వ్యాధికి ఎంత చికిత్స తీసుకున్న ఫలితం కనిపించటం లేదని గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ వార్తలు నిజమేనని.. ప్రస్తుతం మయోసైటిస్ తగ్గకపోగా స‌మంత తీవ‌రా ఇమ్యూన్ లోపంతో ఇబ్బంది పెడుతుందని టాక్‌. దాంతో ఆరోగ్యం క్షిణిస్తుండటంతో ఇప్పుడు సమంత త‌న సిని కెరియ‌ర్‌పై సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

స‌మంత న‌టించిన ది ఫ్యామిలీ మెన్ సిరీస్ హిట్ తరువాత ఆమెకు వరుసగా బాలీవుడ్ సినిమాల‌కు కమిట్ అయింది సమంత. అప్ప‌టి నుంచి క్షణం తీరిక లేకుండా బాలీవుడ్ డేట్స్ అన్ని బ్లాక్ అయిపోయాయి. అయితే ప్రస్తుతం తన అనారోగ్యం దృష్ట్యా సినిమాలు చాలు అనుకుంటుందట సామ్. ఈ నేపథ్యంలోనే ఆరోగ్యం కుదుటపడే వరకు లాంగ్ గ్యాప్ తీసుకుంటానని బాలీవుడ్ నిర్మాత‌ల‌కు చెప్పేసిందట సామ్.

సమంత చివరిగా యశోద సినిమాలో నటించింది. మయోసైటిస్ కారణంగా సినిమా ప్రచారంలో ఆమె పాల్గొనలేదు. ఈ సమస్య నుంచి పూర్తిగా కోలుకునేంత వరకు నటనకు దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించుకున్నట్టు సమాచారం. సమంత పూర్తిగా కోలుకునే వరకు నటనకు సుదీర్ఘ గ్యాప్ ప్రకటించటంతో బాలీవుడ్ నిర్మాతలు సమంత స్థానాన్ని భర్తీ చేసే హీరోయిన్ వేట మొదలుపెట్టారట.

ప్రస్తుతం టాలీవుడ్‌ లో సామ్ నటిస్తున్న ఒకే ఒక చిత్రం ఖుషి. విజయ్ దేవరవరకొండ హీరోగా చేస్తున్న ఈ సినిమా 60శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది. మిగితా 40శాతం కూడా పూర్తిచేసి సౌత్‌ సినిమాలను కూడా సమంత గుడ్ బాయ్ చెప్పుతుందని అంటున్నారు. ఏదేమైనా.. ప్రాణాంతక వ్యాధి మయోసైటిస్ నుంచి త్వరగా కోలుకుని సమంత మళ్ళీ సినిమాల్లో న‌టిస్తుందా అనే అంశం ఇప్పుడు అందరిన్ని క‌ల‌వ‌ర‌పెడుతుంది.