వైర‌ల్ వీడియో: బైకుపై రష్మిక వెంటపడ్డ అభిమానులు.. కారు ఆపి వార్నింగ్ ఇచ్చిన బ్యూటీ!

నేషనల్ క్రష్‌ రష్మిక మందన్నాకు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో స్టార్ హోదాను అందుకున్న ఈ బ‌యూటీ.. ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ లోనూ వరస సినిమాలు చేస్తోంది. త్వరలోనే ఈ అమ్మడి నుంచి రెండు సినిమాలు రాబోతున్నాయి.

అందులో బాలీవుడ్ మూవీ `మిస్టర్ మజ్ను` ఒకటి కాగా.. మరొకటి తమిళ సినిమా వారసుడు. మిషన్ మజ్ను నేరుగా ఓటీటీలో విడుదల కాబోతోంది. వారసుడు వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. అయితే తాజాగా వారసుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో గ్రాండ్ గా జరిగింది.

అయితే ఈ ఈవెంట్ కు రష్మిక బయలుదేర‌గా.. ఆమెకు ఓ వింత ఘటన ఎదురయింది. రష్మిక ఈవెంట్ కు వెళ్తుండగా ఆమెను కొంత మంది అభిమానులు గుర్తించి.. బైక్ పై వెంట‌ప‌డ్డారు. ఈ విషయాన్ని గమనించిన రష్మిక కారు ఆపి తన అభిమానులను హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదు.. ముందు హెల్మెట్ పెట్టుకోండి అంటూ స్వీట్ మార్నింగ్ ఇచ్చింది. ఇందుకో సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట‌ వైరల్ గా మారింది.

https://twitter.com/lanka_rashmika/status/1607613292654243841?s=20&t=U84gwPb6EflUUyG-z1S4MA