నోరుజారిన చిరు.. `వాల్తేరు వీర‌య్య‌`లో ర‌వితేజ పాత్ర‌పై బిగ్ లీక్‌!

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ హీరోలుగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బాబీ తెర‌కెక్కించిన‌ తాజా మాస్ ఎంట‌ర్టైన‌ర్ `వాల్తేరు వీర‌య్య‌`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్ గా న‌టించింది. కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

ఇటీవ‌లె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే వ‌రుస అప్డేట్స్ ను బ‌య‌ట‌కు వ‌దులుతూ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా చిత్ర‌టీమ్ మీడియాతో ఇంట్రాక్ట్ అయింది. ఈ సంద‌ర్భంగా చిరు ఎంతో హుషారుగా మాట్లాడారు. ఈ క్ర‌మంలోనే నోరుజారి ర‌వితేజ పాత్ర‌పై బిగ్ లీక్ ఇచ్చారు.

ఈ చిత్రంలో ర‌వితేజ పోలీస్ ఆఫీస‌ర్ గా క‌నిపించ‌బోతున్నాడ‌ని, ఆయ‌న పాత్ర‌కు మంచి ప్రాధాన్య‌త ఉంటుంద‌ని అంద‌రికీ తెలుసు. అయితే ఆయ‌న పాత్ర సినిమాలో ఎప్పుడొస్తుంద‌ని అన్న ఎవ‌రికీ తెలియ‌దు. తాజాగా ఈ విష‌యంలో చిరు రివిల్ చేశారు. సెకండ్ హాఫ్ లో వచ్చే రవితేజ పాత్రను చాలా అద్భుతంగా బాబీ డిజైన్ చేశాడంటూ ఓపెన్ అయ్యాడు. దీంతో ఫస్ట్ హాఫ్ అంతా మెగాస్టార్ దుమ్ము రేపితే..సెకండ్ హాఫ్ నుంచి రవితేజ దంచి కొడ‌తాడ‌ని స్ప‌ష్టంగా తేలిపోయింది.