రెమ్యూనరేషన్ పెంచేసిన అనుపమ..!!

తెలుగు సినీ పరిశ్రమలో మలయాళం ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ కు ఎంతటి క్రేజీ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను బాగానే అలరించింది. ఈమె నటించిన రెండు చిత్రాలకు కూడా హీరో నిఖిల్ తోనే నటించింది. ఇలా రెండు బ్లాక్ బాస్టర్ తో మంచి క్రేజ్ అందుకున్న అనుపమ మరొక సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయింది. అనుపమ నటించిన బటర్ఫ్లై సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.

Anupama Parameswaran HQ Wallpapers | Anupama Parameswaran Wallpapers -  55544 - Oneindia Wallpapers

ఈ సినిమా డిసెంబర్ 29వ తేదీన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల కాబోతోంది. ఇక ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం పాల్గొనడం జరుగుతోంది. అనుపమ రెండు సినిమాలు మంచి హిట్ అవడంతో తన తదుపరి సినిమాలకు రేమ్యునరేషన్ భారీగా పెంచేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అనుపమ ఒక్క చిత్రానికి రూ.60 నుంచి రూ.70 లక్షలు తీసుకునేదట. కానీ ఈ ఏడాది మంచి విజయాలు అందుకోవడంతో తన రెమ్యూనరేషన్ను డబుల్ చేసినట్లు తెలుస్తోంది. అంటే రూ.1.3 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం.

అనుపమ కు ఉన్నటువంటి క్రేజీల్ని దృష్టిలో పెట్టుకొని పలువురు నిర్మాతలు ఆమె అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి వచ్చే ఏడాది అనుపమ ఎలాంటి సినిమాలతో తన అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి మరి. ఏది ఏమైనా ఏడాది వరుస సినిమాలతో అనుపమ అభిమానులను చాలా సంతోషపెట్టిందని చెప్పవచ్చు.