టాలీవుడ్ స్టైలిష్ స్టార్ నుండి పాన్ ఇండియా ఐకాన్ హీరోగా మారిన అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పినా తక్కువే . డాడీ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన బన్నీ .. ఆ తర్వాత గంగోత్రి సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ సినిమాతోనే క్లాసిక్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న బన్నీ .. ఆ తర్వాత హిట్లు ఫ్లాపులు అంటూ సంబంధం లేకుండా కొత్తగా సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకులను అలరించారు. ఈ క్రమంలోనే ఆయనకు స్టైలిష్ స్టార్ అంటూ బిరుదుని ఇచ్చారు .
గత ఏడాది డిసెంబరు 17న రిలీజ్ అయిన పుష్ప సినిమాలో హీరోగా నటించి తన పేరుకున్న పాపులారిటీని ట్రిపుల్ రేంజ్ లో పెంచుకున్నాడు బన్నీ. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యి అన్ని భాషల్లోనూ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్గా రికార్డ్ నెలకొల్పింది. మొదటి రెండు షోలకే కాస్త నెగటివ్ టాక్ సంపాదించుకున్న ఆ తర్వాత మాత్రం బీభత్సంగా కలెక్షన్స్ సాధించి ఇప్పటికీ టాప్ ట్రైనింగ్ లో దూసుకుపోతున్నాడు.
ఇప్పటికీ టాప్ ట్రైనింగ్ లో పుష్ప సినిమా డైలాగులు వినిపిస్తున్నాయంటే ఈ సినిమా ఎంతటి హిట్ అయిందో అర్థం చేసుకోవచ్చు . కాగా పుష్ప2 సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది . ఇప్పటికే కీలక సన్నివేశాలు చిత్రీకరించిన సుకుమార్ ..ఈ సినిమాలో మరో స్పెషల్ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేయనున్నట్లు సోషల్ మీడియా లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం ఓ కీలక రోల్ లో కనిపించబోతున్నాడు అంటూ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో రామ్ చరణ్ పది నిమిషాల పాటు ఈ సినిమాలో అలరించనున్నాడని తెలుస్తుంది.
ఒకవేళ నిజంగా ఇది నిజం అయితే మాత్రం అల్లు – మెగా ఫాన్స్ కి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి . గత కొన్ని రోజులుగా అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి పడలేదు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . మరీ ముఖ్యంగా చిరంజీవి -అల్లు అర్జున్ మధ్య మాటల్ లేవ్ అంటూ తెలుస్తుంది. ఇలాంటి క్రమంలో అల్లు అర్జున్ సినిమాలో చరణ్ గెస్ట్ పాత్ర చేస్తే మాత్రం కెవ్వు కేక అంటూ సుకుమార్ కి ఇలాంటి ఆలోచన రావడమే గొప్ప విషయం అంటూ ఫ్యాన్స్ పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి దీని పై సుక్కు అఫిషీయల్ ప్రకటన ఎప్పుడు ఇస్తాడో..?