ట్రైలర్: యాక్షన్ తో అదరగొడుతున్న విశాల్ లాఠీ ట్రైలర్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో కోలీవుడ్ హీరో విశాల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం హీట్ ఫ్లాప్ సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న విశాల్ తమిళంలో పలు సినిమాలను తెలుగులోకి డబ్ చేసి సూపర్ హిట్ విజయాలను అందుకున్నారు. ప్రస్తుతం విశాల్ కథానాయకుడుగా, ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేస్తున్న చిత్రం లాఠీ. ఈ సినిమాని హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ని రానా ప్రొడక్షన్ బ్యానర్ పై రమణ సందా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం వంటి భాషలలో ఒకేసారి ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. సరికొత్త కథ అంశంతో వినోద్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ కమర్షియల్ యాక్షన్ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పింది. లాఠీ కి సమాజంలో మార్పు తీసుకురాగల శక్తి ఉందని.. ఆ లాఠీ తో విశాల్ సమాజంలో ఎలాంటి మార్పులు తీసుకువస్తారనే కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. ఈ చిత్రం ఫుల్ మాస్ యాక్షన్ సినిమా అన్నట్లుగా కనిపిస్తోంది.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలర్ లోనే లాఠీ పవర్ ఏంటో చూపించారు విశాల్. మరొకసారి తన యాక్షన్ తో అదరగొట్టేస్తున్నారు. ఇందులో ఒక మంచి ఫ్యామిలీ పోలీస్ గా ఉండే విశాల్ ని చూపించారు. ఇందులో హీరోయిన్ గా సునయన నటిస్తోంది. విశాల్ అభిమానులకు తగ్గట్టుగా ఈ చిత్రం ఉండబోతోంది అన్నట్లుగా ఈ ట్రైలర్ చూస్తే మనకి అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ వైరల్ గా మారుతోంది.