కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురు చూస్తున్న ప్రభాస్ పెళ్లి వార్త కి సంబంధించిన క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనకు తెలిసిందే రెబెల్ హీరోగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రభాస్ ఆ తరువాత మెల్లమెల్లగా తనదైన స్టైల్ లో సినిమాలు చేసుకుంటూ హిట్లు ఫ్లాపులు అని తేడా లేకుండా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. కాగా ఎవరు ఊహించని విధంగా బాహుబలి సినిమాలో ఛాన్స్ అందుకని తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నాడు ప్రభాస్.
ఈ సినిమాలో అమరేంద్ర బాహుబలి గా ప్రభాస్ తప్పిస్తే మరొక నటుడిని ఊహించుకోలేకపోయారు జనాలు . అంతలా ఆ పాత్రకు ప్రాణం పోశాడు ప్రభాస్ . ఈ సినిమాతోనే ప్రభాస్ క్రేజ్ రేంజ్ ట్రిపుల్ అయింది అనడంలో ఆశ్చర్యం లేదు . సినిమా డైరెక్టర్ చేసిన రాజమౌళి కన్నా సినిమాలో నటించిన ప్రభాస్ నే ఎక్కువ హైలైట్ గా మారాడు . సినిమా రిలీజ్ అయి చాలా ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటివరకు ఆ సినిమా తర్వాత హిట్ అందుకోకపోయినా ..ఇప్పటికీ ఆ సినిమా పేరుతోనే ఆయనని గుర్తుపెట్టుకున్నారు జనాలు .
కాగా పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలో నటిస్తున్న ప్రభాస్ రీసెంట్ గా నందమూరి నటసింహం బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ 2 కి గెస్ట్ గా వచ్చారు . ఆయన తన జాన్ జిగిడి దోస్త్ గోపీచంద్ తో ఈ షోలో పాల్గొన్నాడు . టెలివిజన్ చరిత్రలోనే ఫస్ట్ టైం ఇలా పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ సంపాదించుకున్నాక తెలుగు టాక్ షో కి హ్హాజరయ్యారు. దీనికి సంబంధించిన క్రేజీ పిక్స్ అఫీషియల్ గా రిలీజ్ చేసింది ఆహా. ప్రభాస్ చాలా సింపుల్ గా స్టైలిష్ లుక్ లో అదిరిపోయే కటౌట్ లో కనిపిస్తున్నాడు. ఈ షూట్ నిన్న కంప్లీట్ చేశారు . అన్ని కుదిరితే ఈ శుక్రవారం ఆహాలో ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.
కాగా ఈ షోలో నందమూరి బాలయ్య, ప్రభాస్ ని తన పెళ్లి గురించి అడిగి తెలుసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . చాలా కాలం నుండి అనుష్కతో పెళ్లి అంటూ ప్రభాస్ పై వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే బాలయ్య డైరెక్టుగా అనుష్కతో మీ పెళ్ళంట కదా అంటూ అడిగేసాడట . దీంతో ప్రభాస్ సైతం సిగ్గుపడుతూ అలాంటిది ఏం లేదు సార్ అది అంతా ఫేక్ న్యూస్ అంటూ కొట్టి పడేసారట . అంతేకాదు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నానని ఆ అమ్మాయి ఎవరో కూడా మీకు చెప్తానని బాలయ్య షోలోనే ఆ గుడ్ న్యూస్ ప్రభాస్ అభిమానులకు వినిపించాడట . ఇదే క్రమంలో బాలయ్య సైతం టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సంబంధించిన గుడ్ న్యూస్ నా షోలో నా నోట వినిపించడం హ్యాపీగా ఉంది అంటూ చెప్పుకొచ్చారట . ఇదే న్యూస్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.