అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ బాలీవుడ్లో పలు సినిమాలలో నటిస్తూ మంచి క్రేజ్ ను అందుకుంటోంది. తన తండ్రి నిర్మాత బోనికపూర్ వంటి సపోర్టు ఉన్నా సరే తానే స్వతగా ఎదగాలని నిర్ణయించుకొని ఈ ముద్దుగుమ్మ కథలు విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటూ నటిస్తోంది. రీసెంట్ గా వచ్చిన మిలి చిత్రంతో నటించింది. నటనపరంగా పర్వాలేదు అనిపించుకుంది ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బవాల్ మిస్టర్ అండ్ మిస్సెస్ మహి అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రాలే కాకుండా తెలుగులో కూడా ఏదో ఒక చిత్రంలో ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది ఈ ముద్దుగుమ్మ.
శ్రీదేవి కూడా టాలీవుడ్ లో ఎంతటి పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుచేతనే తన తల్లి మాదిరి జాన్వీ కు కూడా టాలీవుడ్ మీద చాలా ప్రేమ ఉందని ఎన్నోసార్లు తెలియజేసింది.సోషల్ మీడియాలో కూడా తన గ్లామరస్ ఫోటోలతో కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ
లేటెస్ట్ గా బికినీ ఫోటోషూట్ లో సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేయగా ప్రస్తుతం అవి వైరల్ గా మారుతున్నాయి.
ఈ ఫోటోల విషయానికి వస్తే బీచ్ ఒడ్డున బికినీ ట్రేడ్ తో బాబోయ్ ఎం అందం అనిపించేలా రేచ్చగోడుతోంది. తనదైన అందంతో ఆడియన్స్ ని మంత్రముగ్ధుల్ని చేసిన జాన్వీ కపూర్ బికినీ షోతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిపోయింది. జాన్వీ సినిమాలలో నటించడం కంటే బయట ఫోటోషూట్లతోనే ఈ ముద్దుగుమ్మ ఓ రేంజ్ లో రెచ్చిపోతోందని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. స్టార్ హీరోయిన్ కూతురు అయ్యింది స్క్రీన్ షో కి దూరంగా ఉంటుంది అనే వార్తలు గతంలో వినిపించాయి. కానీ ఈ మధ్యకాలంలో ప్రతిరోజు తన గ్లామర్ తో ఆకట్టుకుంటోంది జాన్వీ కపూర్.