టాలీవుడ్ సూపర్ స్టార్ సింగర్ గా పేరు సంపాదించుకున్న రేవంత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐడల్ సింగర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు .పలు షో స్ లో పాటలు పాడుతూనే తనదైన స్టైల్ లో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేవంత్ ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నాడు . పెళ్లి చేసుకున్న వెంటనే అభిమానులకు గుడ్ న్యూస్ కూడా వినిపించాడు . ఇలా బ్యాక్ టు బ్యాక్ రేవంత్ లైఫ్ లో వరుసగా గుడ్ న్యూస్ లు వింటున్న తరుణంలోనే తెలుగు టెలివిజన్ చరిత్రలోనే అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ లో ఆఫర్ అందుకున్నాడు.
ఇలాంటి ఆఫర్ లు మళ్ళీ మళ్ళీ రాదు అని గ్రహించిన రేవంత్ ..భార్య కడుపుతో ఉన్నా సరే తన అవసరం తన భార్యకి ఉంది అని తెలిసినా కూడా తానేంట ప్రూవ్ చేసుకోవడానికి బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టాడు. ఈ క్రమంలోనే హౌస్ లో అడుగుపెట్టిన వెంటనే రేవంత్ పై జనాలు ఫుల్ ఫైర్ అయిపోయారు . భార్య ప్రేగ్నెన్సీలో ఉంటే నువ్వు ఇలా డబ్బు కోసం షోకు వస్తావా అని మండిపడ్డారు. కానీ వారాలు గడిచే కొద్దీ రేవంత్ బిగ్ బాస్ కి ఎందుకు వచ్చాడు ..ఆయన మంచితనం.. ఆయన కోపం ..ఆయన నిజ స్వరూపం బయటపడింది .
ఈ క్రమంలోనే ఇన్ని వారాలు హౌస్ లో ఉండి టైటిల్ కొట్టే స్థాయికి ఎదిగిపోయాడు రేవంత్ . ఇప్పటివరకు సోషల్ మీడియాలో, వెబ్ పోల్స్ లో హైయెస్ట్ ఓటింగ్ తో నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న రేవంత్ బిగ్ బాస్ విన్నర్ అవుతారని జనాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇదే విషయాన్ని బిగ్ బాస్ చెప్పకనే చెప్పేసాడు . బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ దగ్గర పడుతున్న తరుణంలో తమ జర్నీలను బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి చూపించారు . ఈ క్రమంలోనే రేవంత్ గురించి కూసింత ఎక్కువ రేంజ్ లోనే పోగిడేశారు. జనాలకు రేవంత్ విన్నర్ అవుతున్నాడని చెప్పకనే చెప్పి హింట్ ఇచ్చేశాడు.
ఈ క్రమంలోనే జీవితంలో తండ్రి అవ్వడం అనే అద్భుత క్షణాలు దగ్గరుండి అనుభవించే అవకాశాన్ని నువ్వు మిస్ అయ్యావు రేవంత్ మీ త్యాగానికి ప్రతిఫలం దక్కాలని బిగ్ బాస్ కోరుకుంటున్నాడు. బిగ్బాస్ ఫినాలే కి బిగ్ బాస్ తరపున మీకు ఆల్ ద బెస్ట్ అంటూ చెప్పుకోచ్చాడు. ఈ క్రమంలోనే ఆయన అలాంటి ఇంపార్టెంట్ క్షణాలను మిస్ చేసుకున్న కారణంగా ఆ త్యాగానికి ప్రతిఫలంగా బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్ బిగ్ బాస్ రేవంత్ ఇస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా సరే మరో వారం రోజుల్లో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరో అఫీషియల్ గా ప్రూవ్ అయిపోతుంది .ఈ క్రమంలోనే రేవంత్ డబల్ ధమాకా అందుకున్నాడని హౌస్ లోకి రాగానే బేబీ పుట్టింది.. ఆ తర్వాత బేబీ ని చూడడానికి బిగ్ బాస్ ట్రోఫీని ఎత్తుకొని రేవంత్ వెళ్తాడని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.
A look-back at Revanth’s Journey in #BiggBossTelugu6.
Don’t miss tonight’s exciting episode on @StarMaa tonight, streaming 24/7 on @DisneyPlusHSTel.#BiggBossTelugu #BBLiveOnHotstar#StarMaa #DisneyPlusHotstar pic.twitter.com/98e0LfTVuR
— starmaa (@StarMaa) December 12, 2022