అవకాశాలు లేక అలాంటి పని కి సిద్ధపడిన బన్నీ బ్యూటీ..తెల్ల తోలు పిల్ల తెగించేసిందిగా..?

సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తే సరిపోదు.. ఆ పేరుని నిలబెట్టుకోవడానికి తగిన రీతిలో కష్టపడాలి . అందంగా ఉన్నాను.. తెల్లగా ఉన్నాను.. నాకు ఎలాంటి వాళ్ళైనా పిలిచి ఆఫర్స్ ఇస్తారు అనుకుంటే పప్పులో కాలేసిన్నట్లే . అలాగే తన అందం పై ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పప్పులో కాలేసింది హాట్ బ్యూటీ ఆదాశర్మ . ఇలా చెప్తే జనాలు గుర్తుపట్టలేరు . బన్నీ సరసన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నటించిన బ్యూటీ అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు .

అలా తను చేసిన అన్ని సినిమాలలోకి ఆ సినిమాలో ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది ఆదా శర్మ. అంతేకాదు నితిన్ తో కలిసి హాట్ అటాక్ అనే సినిమాలో కూడా హద్దులు మీరి నటించి సెక్సీ బ్యూటీ అనిపించుకుంది. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో ఎంత మంచిగా నటించిందో.. హార్ట్ ఎటాక్ సినిమాలో అంత హాట్ రోల్లో కనిపించి జనాలను టెంప్ట్ చేసింది . స్టార్ సినిమాల్లో అవకాశం దక్కించుకున్న సరే ఎందుకో ఆదాశర్మ జనాల కంట్లో పడలేకపోయింది . సినిమాలో సైడ్ క్యారెక్టర్స్ ఓకే గాని మరి స్టార్ హీరోయిన్ అయ్యే ఫిజిక్ ఆమెకు లేదని.. తెల్ల చర్మం మాత్రమే ఉంది కానీ ఆ స్పెషల్ అట్రాక్షన్ ఫేస్ లో లేదంటూ అప్పట్లో జనాలు కామెంట్ చేశారు.


బాలీవుడ్ లో కూడా పలు సినిమాలతో మెప్పించిన ఆదాశర్మ ప్రజెంట్ బుల్లితెర పై కూడా పలు వాణిజ్యపరమైన ప్రకటనలో మెప్పిస్తుంది. అయితే చేతుల్లో ఒక్క ఆఫర్ కూడా లేని ఆదాశర్మ ఆఫర్స్ కోసం ఐటెం సాంగ్ లో నటించడానికి కూడా సిద్ధపడింది అంటూ బాలీవుడ్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది . అమ్మడు ఫిజిక్కి హీరోయిన్గా కంటే హాట్ ఐటమ్ గర్ల్ గానే పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుందని బాలీవుడ్ జనాలు కామెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు ఇప్పటికే రెండు ఐటెం సాంగ్స్ ని యాక్సెప్ట్ చేసిందని తెలుస్తుంది. ఏది ఏమైనా సరే స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలో ఏలేద్దామనుకున్న ఆదా శర్మ ఆఖరికి ఇలా బాలీవుడ్ ఐటమ్ గర్ల్ గా మారడంతో ..జనాలు ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు . తెల్ల చర్మం ఉంటే సరిపోదు దానికి తగ్గ నటన కూడా ఉండాలి అంటూ ఆమెకు పరోక్షంగా నటన రాదు అంటూ కామెంట్ చేస్తున్నారు.